సినిమాల్లో డిమాండ్ సప్లయ్ మధ్య సంబంధం ఎక్కువ. ఒక్క మూవీ హిట్టయితే.. అంతే.. రెమ్యునరేషన్ పెంచేస్తారు. అయితే.. ఒక్కొక్కొసారి ఇది వికటిస్తుంది కూడా. ఎందుకంటే.. అనుకున్నంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలా.. కొందరు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వెనుకబడిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో జమున ఒకరు.
ఆమెకు ప్రతినాయక పాత్రల్లో మంచి పేరు వచ్చింది. మంగమ్మ శపథం సినిమాతో అన్నగారు ఎన్టీఆర్ పక్కన తల్లి భార్యగా కూడా నటించిన జమున.. తర్వాత.. తీసిన శ్రీకృష్ణసత్య
సినిమాకు వచ్చేసరికి రెమ్యూన రేషన్ పెంచేశారు. వాస్తవానికి అన్నగారి కన్నా.. ఎక్కువ ఎవరూ.. ఇచ్చేవారు కారు ఆ రోజుల్లో. అయితే.. మంగమ్మ శపథం సూపర్ హిట్ కొట్టడంతో అప్పటి వరకు 3 లక్షలుగా ఉన్న జమున రెమ్యునరేషన్ ఏకంగా రు. 10 లక్షలకు పెంచారు.
సత్య సినిమాకు 10 లక్షలు తీసుకున్నారు. అప్పటికి ఎన్టీఆర్ తీసుకునేది అంతే. దీంతో హీరోతో పాటు సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. సత్య సినిమాలోనూ జమునకు మంచి పేరు వచ్చింది. ప్రతినాయక (సత్య పాత్ర) పాత్రను పోషించడం అంటే.. అది ఒక్క జమునకే సాధ్యమని అనేలా పేరు తెచ్చుకున్నారు. ఇక, బాపు తీసిన సంపూర్ణ రామాయణానికి కూడా జమున ప్రతినాయక పాత్ర పోషించారు.
రాముడిని అడవులకు పంపాలంటూ.. దశరథుడి వద్ద షరతు పెట్టిన కైకేయి పాత్రను జమున అద్భుతంగా పోషించారు. ఇక్కడ అనుకున్నది 10 లక్షల రెమ్యునరేషన్. అప్పటికి అంతే. అయితే.. సినిమా షూటింగ్ మధ్యలోనే ఎవరో చెప్పారట.. తక్కువ తీసుకుంటున్నావు.. ఏమాత్రం ప్రాధాన్యం లేని కౌసల్య పాత్రకే 10 లక్షలు ఇస్తున్నారు.. అని! అంతే.. దీనిని ఇంకా పెంచాలని బాపుతో జమున వివాదం పడ్డారు.
బాపు ఇలాంటివి ఇష్టపడేవారు. ముందు మాట్లాడుకున్నది తీసుకోండి సత్యగారు! అన్నారట. అలాకుదరదని.. ఆయనను బలవంతం చేసి.. మరీ ఆమెకు ముందుగా ఫిక్స్ చేసిన దానికంటే రెండు మూడు లక్షలు ఎక్కువ తీసుకున్నారట.. జమున.. ఇది అప్పట్లో సినీమా ఇండస్ట్రీలోనే పెద్ద రికార్డుగా చెప్పుకొనేవారు.