Moviesహీరోయిన్ గీతాంజ‌లిని సెట్లోనే పెళ్లి చేసుకుంటాన‌ని బెదిరించిన స్టార్ హీరో…!

హీరోయిన్ గీతాంజ‌లిని సెట్లోనే పెళ్లి చేసుకుంటాన‌ని బెదిరించిన స్టార్ హీరో…!

టాలీవుడ్ లో 1960 – 70వ దశకంలో టాప్ హీరోయిన్లలో పేరుగాంచిన హీరోయిన్ గీతాంజలి. గీతాంజలి 1947లో కాకినాడలో జన్మించారు. గీతాంజలి తండ్రి శ్రీరామమూర్తి.. కాగా తల్లి శ్యామసుందరి. నలుగురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండో అమ్మాయిగా జన్మించారు. కాకినాడలోనే ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయింది. అక్కడ నుంచి గంధర్వనాట్యమండలిలో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.

అలా ఆమె సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాల్లో నటించిన ఆమె మిగిలిన భాషల్లోనూ రెండు మూడు సినిమాలలో నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. అయితే ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా నిర్మాతలు లక్ష్మీకాంత్, ప్యారేలాల్‌ సినిమా టైటిల్ లోను మణి ఉండడంతో ఆమె పేరును గీతాంజలిగా మార్చేశారు. అలా మణి కాస్త గీతాంజలిగా మారిపోయింది.

గీతాంజలి సీతారామ కళ్యాణం సినిమాలో హరినాథ్‌కు జోడిగా నటించింది. అయితే సీతారాముల కళ్యాణం చూతము రారండి సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు.. హరినాథరాజు ఆమెను పదేపదే ఆట పట్టించే వారట. నేను ఈ పాట వస్తున్నప్పుడు నీ మెడలో మంగళసూత్రంతో నిజంగానే మూడు ముళ్ళు వేసేస్తాను.. అప్పుడు నిజంగానే నువ్వు నాకు భార్య అయిపోతావు అనడంతో గీతాంజలి, ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఇద్దరు హడలిపోయారట. పదేపదే మూడు ముళ్ళు వేస్తున్నట్టు చూపిస్తూ ఉండడంతో గీతాంజలికి కూడా భయం పట్టుకుందట.

ఆమె తండ్రి శ్రీరామ‌మూర్తి సైతం కంగారుపడుతూ ఈ విషయాన్ని తాను పెద్దాయన ఎన్టీఆర్‌కు విష‌యం చెప్పేస్తానని అనేవారట. సినిమాలలో తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని.. అయితే సీతారామ కళ్యాణం సినిమా కోసం తొలిసారిగా పెళ్లి సీన్లో నటించాల్సి వచ్చిందని.. అప్పుడు హర‌నాథ‌రాజు.. తనను ఆటో పట్టించి ఏడిపించారని నాటి స్మృతులను ఆమె ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.

ఇక ఆమె తన సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. వివాహం కాకముందు రామకృష్ణ – గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌… గీతాంజలి ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది రామ‌కృష్ణ‌కు రెండో వివాహం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news