బాగా ఓల్డ్ మూవీలను గమనిస్తే.. కస్తూరి శివరావు పెద్ద హీరో. అప్పట్లోనే ఆయన 25 -50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అప్పట్లో బేడ (ఇప్పటి తరానికి అస్సలు తెలియదు)కు 2 కిలోల బియ్యం అమ్మేవారు. ఒక సగటు ఉద్యోగి నెల జీతం 2 రూపాయలు.. ఉన్నతాధికారి నెల జీతం 25 రూపాయలు. సో.. దీనిని బట్టి కస్తూరి శివరావు తీసుకున్న రెమ్యూనరేషన్‌ను లెక్కించవచ్చు.
పోనీ, శివరావు ఏమన్నా.. స్ఫురద్రూపా? అంటే .. కానేకాదు. బక్కపలచన మనిషి. నాన్ వెజ్ తినడు. సిగరె ట్ కూడా కాల్చడు. బుగ్గలు మాత్రం పీక్కుపోయి ఉంటాయి. అలాంటి హీరో.. రూ. కోట్లు సంపాయించారు. ఈ క్రమంలోనే ఆయన శ్రీరంజని.. అని ఓ ఓల్డ్ హీరోయిన్‌తో ఆయన లవ్‌లో పడ్డారు. ఆమె అప్పటికే జమీందార్ల పిల్ల. ఆమెను గోవిందరాజుల సుబ్బారావు సినీ ఫీల్డ్‌కు తీసుకువచ్చారు.
అయితే.. ఏమీ లేని స్థాయి నుంచి అంటే.. విజయవాడ, గాంధీనగర్‌లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర అర్ధ రూపాయి జీతానికి గుమాస్తాగా పనిచేసిన కస్తూరి శివరావు సినీ అరంగేట్రం చేయడం.. కోట్లు సంపాయించ డం.. మామూలు విషయం కాదుకదా!! ఇదే.. ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీరంజని ప్రణయంతో ఆయన మరింతగా మారారు. రూపాయి దాచుకోవాలన్న స్పృహ ఆయనకు లేదు. వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేవారు.
అయితే.. దీనిని మానుకోవాలని శ్రీరంజని చెప్పేవారట. కానీ, మనవాడు వింటేనా? వినలేదు. సినీ ఫీల్డ్‌లో ఎవరైనా అవకాశం కోసం వస్తే.. వారిని తన రూంలో పెట్టి.. నెలల తరబడి వారికి అవకాశం వచ్చేవరకు పోషించేవారట. ఇదే.. శ్రీరంజనికి నచ్చలేదు. దీంతో ఆమె.. మారితేనే మాట్లాడతానని చెప్పడం.. కస్తూరిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది.. తర్వాత కాలంలో ఆయనను మద్యానికి బానిస అయ్యేలా చేసిందని అంటారు. చివరకు ఆయన వివాహం చేసుకోకుండానే మరణించారు.