టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఏం మాయ చేసావే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . హిట్ ఇచ్చిన హీరోతోనే లవ్ ట్రాక్ నడిపి పెళ్లి చేసుకున్న సమంత ..ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల కారణంగా అతనితో బ్రేకప్ చెప్పేసుకొని విడాకులు తీసుకునింది. ప్రజెంట్ సింగిల్ లైఫ్ ని ఏంజాయ్ చేస్తుంది .
కాగా ఆమె విడాకుల తరువాత ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ముఖ్యంగా సమంతకు వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందని.. ఆ కారణంగా నాగచైతన్యకు డివోర్స్ ఇచ్చింది అన్న న్యూస్లు హల్చల్ చేస్తున్నాయి . అయితే ప్రాణం గా ప్రేమించుకున్న ఈ జంట విడిపోవడానికి పెళ్లిలో నాగార్జున చేసిన చిన్న తప్పే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాగచైతన్య – సమంతల పెళ్లి ముహూర్తం పెట్టిన టైం బాగోలేదని ..6 అక్టోబర్ 2017 వాళ్ల జాతకాల ప్రకారం పెళ్లి చేసుకోకూడదని.. పండితులు ముందే చెప్పిన నాగార్జున అవి వినకుండా.. అలాంటివి ఫాలో అవ్వకుండానే వాళ్ళ పెళ్లిని ముందుగా జరిపించారట .
వాళ్ళ వైవాహిక జీవితం ముందుకు వెళ్లాలంటే ప్రేమ ఉండాలి కానీ.. అది తప్పిస్తే మిగతాదంత అనవసరం అంటూ నాగార్జున లవ్ పైనే ఎక్కువ నమ్మి ఈ జంటకు పెళ్లి చేశారట. ఈ క్రమంలోనే పెళ్లి ముహూర్తం పెట్టిన టైం బాగోలేక వీళ్ళు విడిపోయారు అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ఈ జంట కలిస్తే మళ్ళీ చూడాలి అన్నది అక్కినేని అభిమానులు కోరిక. ఈ జంట కలవరు అంటూ సినీ విశ్లేషకులు సైతం చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!