Moviesబిగ్ బ్రేకింగ్: "శుక్రవారం నా పెళ్లి".. విజయ్‌ వర్మతో రిలేషన్‌షిప్‌పై తమన్నా...

బిగ్ బ్రేకింగ్: “శుక్రవారం నా పెళ్లి”.. విజయ్‌ వర్మతో రిలేషన్‌షిప్‌పై తమన్నా అఫిషీయల్ కామెంట్స్‌..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. గతంలో ఆమె నటించడం సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోని తమన్నాకు అవకాశాలు తగ్గాయి . అయినా సరే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. పలు యాడ్స్ తో బ్రాండ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ అటు సోషల్ మీడియాలో ఇటు వెండి తెర పై తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వినిపిస్తున్నాయో మనందరికీ బాగా తెలుసు.

న్యూ ఇయర్ సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది . ఈ వీడియో బయటకొచ్చినప్పటినుంచి తమన్న పెళ్ళి వార్త జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే ఆమె పెళ్లి అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి . బాలీవుడ్ లో కూడా తమన్నా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే విజయ్ వర్మ రిలేషన్షిప్ పై స్పందించింది తమన్నా.

ఓ ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆమె తనపై జరుగుతున్న పెళ్లి ప్రచారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . ఆమె మాట్లాడుతూ..” నేను విజయ్ వర్మ కలిసి ఉన్న వీడియో బయటకి వచ్చింది. అప్పటినుంచి మాపై రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అదేదో తెలియదు కానీ ఎందుకు నా పైన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనేది అర్థం కావడం లేదు . మాకు నిజంగా వివాహ జరిగే సమయానికి ప్రజలు చాలా పెళ్లిలు చూసేస్తారు . అంతెందుకు ప్రతి శుక్రవారం మాకు పెళ్లి జరుగుతూనే ఉంటుంది . డాక్టర్ నుంచి బిజినెస్ మాన్ వరకు ఇలా అందరితో నాకు పెళ్లి చేసేస్తారు సోషల్ మీడియా. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడో పెళ్లయిపోయినా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా పెళ్లెప్పుడు జరుగుతుందో తెలియదు.. అప్పటివరకు ప్రజలు ఉత్సాహం నేనెందుకు కాదనాలి ..మాట్లాడుకొనివ్వండి .. నిజంగా నా పెళ్లి జరిగినప్పుడు డు నేను కచ్చితంగా చెప్తాను “అంటూ సెటైర్లు పేల్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news