సినిమా ఇండస్ట్రీలో విలనీ పాత్రలకు పెట్టింది పేరు ఎస్వీ రంగారావు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన ఎంట్రీ చిత్రంగా జరిగింది. హీరో కావాలనేది ఆయన సరదా. అప్పట్లోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతున్నారు. అయితే.. ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక.. అప్పట్లో అవకాశం ఇవ్వాలంటే..గోవింద రాజుల సుబ్బారావు వంటి వారిని పట్టుకునేవారు.
ఇదే పని ఎస్వీ రంగారావు కూడా చేశారు. అయితే.. సుబ్బారావు ఎస్వీని చూడగానే.. నువ్వు హీరోగా వద్దబ్బా య్! నా మాట విని విలన్ పాత్రలు ఎంచుకోబాగుంటుంది..! అని సూచించారట. కానీ, రంగారావు కు సుతరాము ఇష్టం లేదు. దీంతో రెండేళ్లపాటు ఖాళీగానే ఉన్నారు. ఇంటి నుంచి డబ్బులు రావడం.. వాటినే ఖర్చు పెట్టుకుని రోజులు గడుపుకోవడం ఇదే పని అయింది.
ఇక ఎన్నాళ్లని ఉంటాం.. అని మరోసారి సుబ్బారావును కలిసారు. దీంతో ఆయన ఎస్వీని వెంటబెట్టుకుని అప్పటి ఇండస్ట్రీ పెద్దలను కలిసి.. మా వాడే.. తెలుగు బాగా వచ్చు.. ఏదైనా హీరో పాత్ర ఇవ్వాలని కోరారు. దీంతో మోహినీ విజయం సినిమాలో హీరో పాత్ర దక్కింది. ఇది సాంఘిక సినిమా. బాగానే మొదలైంది. కానీ, హఠాత్తుగా డైరెక్టర్ చనిపోయారు. ఆయనే నిర్మాత కూడా! దీంతో సినిమా ముందుకు సాగలేదు.
మళ్లీ ఖాళీ. దీంతో ఇక, చివరకు సుబ్బారావును కలిస్తే.. ఇప్పుడు విలనీ పాత్రరెడీగా ఉందినటిస్తావా? అని అడిగారట. ఇలా.. నటించిన సినిమానే షావుకారు
. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు విలన్‌గా నటించారు. సూపర్ నేమ్ వచ్చింది. అంతే.. ఇక, వెనుదిరిగి చూడలేదు. కానీ, హీరో గా నటించాలన్న ఆయన అభిలాష మాత్రం తీరలేదు. ఇదీ, సంగతి..!