MoviesSamantha "ఛీ..ఛీ అసలు అది".. సమంత ఐటెమ్‌ సాంగ్‌పై అలనాటి సింగర్‌...

Samantha “ఛీ..ఛీ అసలు అది”.. సమంత ఐటెమ్‌ సాంగ్‌పై అలనాటి సింగర్‌ ఎల్‌ ఆర్‌ ఈశ్వరి షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కూడా హద్దులు మీరి మాట్లాడుతున్నారు . ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఒక పద్ధతి అయితే ..ఉన్నది ఘాటుగా చెప్పి ఎదుటి జనాలను హార్ట్ చేయడం మరో పద్ధతిగా మారిపోయింది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు స్టార్స్ ఇంటర్వ్యూ లు ఇస్తూ.. గతంలో జరిగిన ఇష్యూస్ ని గతంలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ని ఓపెన్ గా బయట పెడుతున్నారు . అంతేకాదు గతంలో సినీ ఇండస్ట్రీ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి తేడా ఏంటి అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే స్టార్ సింగర్ ఎల్‌ ఆర్‌ ఈశ్వరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎల్‌ ఆర్‌ ఈశ్వరి అంటే జనాలుకు తెలియకుండానే ఓ ఊపు వచ్చేస్తుంది. జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు . ఆమె ఏ పాట పాడిన సరే స్టేజ్ దద్దరిల్లిపోతుంది. అలాంటి స్టార్ స్టేటస్ అందుకున్న ఎల్‌ ఆర్‌ ఈశ్వరి రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన బాల్య విశేషాలు.. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు తాను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఓపెన్ గా చెప్పింది .

ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత కెరియర్ లోనే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో నటించిన పుష్ప సినిమాలోని “ఊ అంటావా మావ” సాంగ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ” ఛి ఛి అసలు అది పాటేనా ..స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేగా వెళ్తూ ఉంటుంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఆ మాత్రం చూసుకోడా..? ఈ కాలం సింగర్స్ కి అలాంటివి తెలియదు.. డైరెక్టర్ నే చూసుకోవాలి.. మ్యూజిక్ డైరెక్టర్ అన్ని దగ్గరుండి చూసుకొని ఉంటే ఆ పాట మరింత హిట్ అయ్యేది. ఆ పాట గనుక నా చేతికి వచ్చుంటే కధ వేరే లేవల్ లో ఉండేది ” అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ పరువు పోయినట్లైంది. అంతేకాదు పరోక్షంగా అలాంటి సాంగ్స్ నాకు ఇవ్వండి అంటూ చెప్పినట్లు కూడా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మరోసారి సమంత ఐటెం సాంగ్ ను ట్రోల్ చూస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news