MoviesTarun త‌రుణ్‌ ని గోకిన ఆ స్టార్ హీరోయిన్ చెల్లి .....

Tarun త‌రుణ్‌ ని గోకిన ఆ స్టార్ హీరోయిన్ చెల్లి .. అక్క వాష్ రూమ్ లోకి వెళ్ళగానే రెచ్చిపోయి.. ఏం చేసిందో తెలుసా..?

దివంగత అందాల తార ఆర్తి అగర్వాల్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నిజంగా ఇప్పుడు ఆర్తి ఉండి ఉంటే టాలీవుడ్ లో ఆమెకు మంచి క్యారెక్టర్లు పడేవి. ఇప్పుడున్న హీరోలకు అక్కగాను … వదిన గాను లేదా కొత్త హీరోలకు ఆంటీగానో మంచి మంచి పాత్రలు పడేవి. ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్తి అగర్వాల్ ఫోటో చూసిన నిర్మాత సురేష్ బాబు ఆమెను ఇండియాకు రప్పించి.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు.

తొలి సినిమా పెద్ద హీరోతో అవకాశం.. పైగా సూపర్ హిట్. ఆ సినిమాలో ఆర్తి అందాచందాలు చూసిన తెలుగు కుర్ర కారు ఆమె మాయలో పడిపోయింది. దీంతో ఆమెకు తిరిగి లేదు. వెంటనే రెండో సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ లోనే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వు లేక నేను లేను. ఆ సినిమా కూడా సూపర్ హిట్. వెంటనే ఉదయ్కిరణ్ తో నీ స్నేహం – చిరంజీవితో ఇంద్ర వరుసగా సూపర్ డూపర్ హిట్లు ఆమె ఖాతాలో పడిపోయాయి. ఆ వెంటనే వెంకటేష్ – నాగార్జున – బాలకృష్ణ – మహేష్ బాబు – ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేసి నాలుగేళ్లపాటు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది.

అన్ని బాగానే ఉన్నా హీరో తరుణ్ తో ఆమె ప్రేమలో పడటం.. ఆమె కెరీర్లో చేసిన పెద్ద మిస్టేక్ అని చెబుతూ ఉంటారు. తరుణ్.. ఆర్తి ప్రేమించుకున్నారు.. ఇంకా చెప్పాలంటే తరుణ్ కంటే ఆర్తీయే పిచ్చపిచ్చగా తరుణ్‌ను ప్రేమించేసింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం తరుణ్ తల్లి రోజా రమణికి ఇష్టం లేదని అంటారు. దీంతో ఆర్తీ హృదయం ముక్కలైంది. నిజానికి వీరిద్దరి జంట ఎంతో బాగుంటుందని నిర్మాత సురేష్ బాబు రెండోసారి కూడా తన బ్యానర్ లో వచ్చిన సోగ్గాడు సినిమాలో వీరిద్దరిని రిపీట్ చేయడం విశేషం.

ఇక ఆర్తితో పాటు ఆమె చెల్లి గంగోత్రి హీరోయిన్ అయిన అదిధి అగర్వాల్ కూడా తరుణ్ను ప్రేమించిందని అంటారు. ఒకానొక సమయంలో ఈ ముగ్గురు కలిపి రెస్టారెంట్ కు వెళ్లారట. అక్కడ ఆర్తి అగర్వాల్ తన చేతులు వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్లగా.. అదితి తరుణ్తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే ప్రయత్నం చేసిందట. ఈ సీన్ చూసిన ఆర్తి వెంటనే అక్కడికి వచ్చి తన చెల్లి చెంప చెళ్ళు మనిపించిందట. అంటే తరుణ్‌ను ఆర్తి తనకు మాత్రమే సొంతమైన ప్రేమికుడిగా చూసింది. కనీసం అత‌డితో తన సొంత చెల్లి కూడా క్లోజ్ గా ఉండేందుకు ఆమె ఇష్టపడలేదు.

అంత పిచ్చిపిచ్చిగా ప్రేమించిన తరుణ్ తన ప్రేమను కాదనేసరికి ఆర్తీ తట్టుకోలేకపోయిందని.. అక్కడ నుంచి ఆమె కెరీర్ తలకిందులు అయిపోయిందని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆర్తి తండ్రి ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక అమెరికా ఎన్నారై తో పెళ్లి చేసేసారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. మూడేళ్లలోనే ఆర్తి అతడికి విడాకులు ఇచ్చేసి తిరిగి ఇండియాకు వచ్చింది. ఆ త‌ర్వాత ఆమె శ‌స్త్ర‌చికిత్స విక‌టించి మృతిచెందింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news