హాట్ నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ సెన్షేషన్. ఆ మాటకు వస్తే ఆమె గత నాలుగైదేళ్లుగా ఏం చేసినా సంచనలమే అవుతోంది. కాస్టింగఖ కౌచ్ వివాదంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు ఆమె నోరు తెరిస్తే వచ్చే బండ బూతులు, పచ్చి బూతులు వినలేక చస్తుంటే మీడియా వాళ్లు, సోషల్ మీడియా వాళ్లు ఆమెను కావాల్సినంతగా ఎంటర్టైన్ చేస్తూ మరింతగా రెచ్చ గొడుతున్నారు.
దీంతో శ్రీరెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ లో పెద్ద కుటుంబానికి చెందిన దగ్గుబాటి అభిరాంను కూడా ఆమె టార్గెట్‌గా చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది. అభిరాం తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని వాడుకున్నాడని కూడా శ్రీరెడ్డి పెద్ద సంచలనం రేపింది. అసలు శ్రీ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే షాక్ అవుతాం.
ఆమె బ్యాక్‌గ్రౌండ్‌కు.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి వ్యవహరిస్తోన్న తీరుకు అసలేమాత్రం పొంతన ఉండదు. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని కుంకుదురులో ఓ దిగువ మధ్యతరగతి రెడ్డి కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు విమల మల్లిడి. శ్రీ రెడ్డి తండ్రి వెంకన్నబాబు ఓ బ్రాహ్మణుడిలా ఎప్పుడు దేవుళ్లకు పూజా, పునస్కారాలు చేస్తూ ఉంటారట.
వాళ్లది ఎంత సాంప్రదాయ కుటుంబం అంటే వాళ్ల ఇంట్లో చాలా యేళ్ల వరకు టీవీ కూడా లేదట. టీవీ చూస్తే పిల్లలు చెడిపోతారని చివరకు టీవీ పెట్టేందుకు కూడా వెంకన్నబాబు ఇష్టపడలేదట. అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి గ్లామర్‌గా ఉండడం ఇష్టం. అలా అప్పుడే సాక్షి ఛానెల్ ఓపెన్ కావడంతో తనకు తెలిసిన ఓ మిత్రురాలి ద్వారా సాక్షిలో యాంకర్ అడిషన్స్ కోసం వచ్చింది.
ఆమె వెంటనే సెలక్ట్ అయ్యింది. అయితే విమల అన్న పేరు బాగోలేదని.. అక్కడ వాళ్లు శ్రీలేఖ అని పేరు మార్చేశారు. అలా యాంకర్ శ్రీలేఖగా ఆమె పేరు మారింది. ఆ తర్వాత తెలిసినోళ్లు ఆమెను సినిమాల్లో ట్రై చేయమని చెప్పడం.. సినిమా అడిషన్స్ కోసం వెళుతున్న క్రమంలోనే కొందరు దర్శక నిర్మాతలు ఆమెను అవకాశాల పేరుతో వాడుకోవడం జరిగింది.
అయితే శ్రీరెడ్డి ఇంట్లో ఉన్నప్పుడే ఆమె ఇంట్లో వాళ్లు చెప్పినట్టు వినకపోవడం.. బాగా అల్లరి చేస్తూ ఉండడంతో పాటు గ్లామర్‌గా ఉండేందుకే ఇష్టపడడంతో వాళ్ల నాన్న కేవలం 14 ఏళ్లకే ఓ వ్యక్తితో పెళ్లి చేసేశారు. అయితే శ్రీరెడ్డికి ఈ పెళ్లి, అతడితో కాపురం ఎంత మాత్రం ఇష్టంలేదు.. అందుకే అతడిని వదిలేసి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ చెక్కేసింది.