దాసరి నారాయణరావు సినిమా రంగంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆశీర్వాదంతో అనేక మంది దర్శకులుగాను.. నటులుగాను హిస్టరీ క్రియేట్ చేశారు. వీరిలో మోహన్‌బాబు వంటివారు కూడా ఉన్నారు. ఇక వర్ధమాన నటులు ఎంతో మంది ఉన్నారు. అయితే.. అందరికీ కూడా దాసరి.. ఒక మార్గదర్శకులు..దేవుడు కూడా..
అయితే.. ఆంధ్రుల అందగాడు.. శోభన్‌బాబు మాత్రం దాసరితో విభేదించారు. ఇది కూడా.. ఆయన తుది వరకు.. ఈ విభేదాలు కొనసాగించడం గమనార్హం. దీనికి కారణం చెప్పేముందు.. ఇండస్ట్రీలో ఒక దశలో హీరో కృష్ణకు.. శోబన్‌బాబుకు కూడా మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుల్లోను.. మంచి మంచి కథలతో సినిమాలు తీసిన దర్శకుల్లోనూ దాసరి ముందు వరుసలో ఉన్నారు.
కానీ, దర్శకరత్న దాసరి.. సినీ రంగంతోపాటు.. మీడియాలోకీ వచ్చారు. ఉదయం దినపత్రికను స్థాపించారు. దీనిని ఈనాడుతో పోటీగా తీసుకువచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో ప్రత్యేకంగా సినిమా వార్తలకు ఓ పేజీ వరకు కేటాయించారు. సినిమా వార్తలకు పేజీ ఇవ్వడం అనేది అదే తొలిసారి. అప్పటి వరకు ఈనాడు సితార అని ప్రత్యేకంగా మ్యాగజైన్ తీసుకువచ్చేది.
సితార సినిమా వార్తలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేది కాదు. కానీ, ఉదయంలో మాత్రం గ్యాసిప్‌లు సినిమా వార్తలు కోకొల్లలు. ఇలా.. ఉదయం అసలు సర్క్యులేషన్ పెరగడానికి ఇదేకారణమని అంటారు. ఇలా.. ఓ సందర్భంలో జయలలిత – శోభన్‌బాబు గురించి.. ఆఫ్ పేజీ ఆర్టికల్ ముద్రించారు.
ఆ సమయానికి దాసరి విదేశాల్లో ఆపరేషన్ కోసం వెళ్లారు. ఈ విషయం ఆయనకు తెలియదు. ఈ గ్యాసిప్ సంచలనం రేపింది. దీంతో శోభన్‌బాబు నేరుగా దాసరికి పోన్ చేసి తిట్టారని.. అప్పటి నుంచి మీడియాకు ఆయన దూరంగా ఉన్నారని కథనం. ఈ విషయంలో దాసరి అప్పటి ఎడిటర్‌ను తప్పించడం గమనార్హం.