టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఐదు సినిమాల్లో రెండు తమిళ హీరోలు నటించిన సినిమాలు కాగా… మరో మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలు 50 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమా ఎన్ని సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏ హీరో సినిమా 50 రోజుల విషయంలో డామినేట్ చేసిందో చూద్దాం.
ముందుగా సంక్రాంతికి రిలీజ్ అయిన అజిత్ తునివు ( తెలుగులో తెగింపు) ఒక్క కేంద్రంలో డైరెక్టుగా 50 రోజులు ఆడింది. అఖండ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి థియేటర్లలోకి వచ్చింది. శృతీహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. బాలయ్య కెరీర్‌లో 107వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీరసింహారెడ్డి 23 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సినిమా తర్వాత మరుసటి రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ, చిరంజీవి ఇద్దరు కలిసి నటించారు. బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఓవరాల్‌గా 74 కేంద్రాల్లో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఆ మరుసటి రోజు తమిళ హీరో విజయ్ వారసుడు రిలీజ్ అయ్యింది. మన తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించగా.. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
వారసుడు ఏపీ, తెలంగాణలో 9 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ నాలుగు సినిమాల్లో 50 రోజుల సెంటర్ల డామినేషన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన డామినేషన్ స్పష్టంగా చూపించారు.