హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుందంటూ ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. నాగచైతన్యకు ఆమె విడాకులు ఇచ్చేసి ఏడాదిన్నర అవుతుంది తాజాగా ఆమె మెడలో నల్లపూసల దండ.. పెద్ద పసుపుతాడు కొత్త అవతారంలో కనిపించడంతో ఆమె పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది. సాధారణంగా కొత్తగా పెళ్లయిన మహిళల మెడలోని పసుపు తాడు ఉంటుంది. నల్లపూసల దండ వేసుకుంటారు. ఇది చూసి సమంత రెండో పెళ్లి సీక్రెట్ గా చేసేసుకుందని ఒకటే హంగామా మొదలుపెట్టేశారు.
దీనిపై వాస్తవం ఏంటని ఆరా తీస్తే సమంత రెండో పెళ్లి చేసుకోలేదు. ఆమె ఒక సినిమా షూటింగ్ కోసం అలా తయారయింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత.. కాస్త గ్యాప్ తీసుకుని విజయ్ దేవరకొండ ఖుషి సినిమా సెట్స్ లోకి జాయిన్ అయింది. ఈ సినిమాలో ఒక సీన్ కోసం ఆమె మెడలో నల్లపూసలు, పసుపుతాడుతో దర్శనం ఇచ్చింది. ఇది సినిమాలో ఒక పెళ్ళి సీన్ అని తెలుస్తోంది.
దీనికోసం సమంత ముస్తాబు కాగా ఎవరో సీక్రెట్ గా ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో సమంత రెండో పెళ్లి చేసుకున్న వార్తలు జోరుగా వైరల్ అయిపోతున్నాయి. వాస్తవంగా ఇది ఖుషి సినిమా కోసం వేసుకున్న గెటప్. ఇక ఈ వార్తలు వైరల్ అవుతుండడంతో సమంత క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపై దృష్టి సారించానని.. సినిమాలు తప్ప తనకు రెండో ఆలోచన లేదని చెప్పేసింది.
సమంత చెప్పిన దానిని బట్టి చూస్తే ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ? పెళ్లి ఆలోచనలు లేవు. సమంత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలి. ఈ క్రమంలోనే అనారోగ్యం భారినపడి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత హాలీవుడ్ వెబ్ సిరీస్ తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఆమె సినిమాలకు ఓకే చెప్పింది సో సమంత ఇప్పట్లో పెళ్లి అయితే చేసుకోదు.