ప్రస్తుతం నడుస్తోంది అంతా స్మార్ట్‌ఫోన్ యుగం. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు అజాగ్రత్తగా ఉన్నా కొంపలు అంటుకుపోతున్నాయి. ఇంటి గుట్టు అంతా బయటకు వెళ్లిపోతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండడంతో చాలా మంది సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం చేస్తున్నారు. మరి కొందరు అయితే ఈ వీడియోలు, ఫొటోలు తమ ప్రతిభను వాడుకుంటూ ఎడిట్ కూడా చేసుకుంటున్నారు.
అయితే వీటి గోప్యత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బయటకు వెళ్లిపోతున్నాయి. అవి బయటకు వెళితే పరువు అంతా గంగలో కలిసిపోవడంతో పాటు చాలా దుష్పలితాలు వస్తున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. భార్యభర్తల మధ్య రహస్యంగా ఉంచాల్సిన కాపురం గుట్టు బయట పెట్టేశాడు. చివరకు ఓ నికృష్టపు భర్తగా మిగిలిపోయాడు.
అసలు విషయంలోకి వెళితే ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ఓ తీర గ్రామంలో ఇటీవలే ఓ యువకుడికి (20), ఓ బాలిక (17)తో పెళ్లి జరిగింది. ఆ భర్త సభ్య సమాజమే సిగ్గుపడేలా తన భార్యతో ఫస్ట్ నైట్‌లో గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
చివరకు అవి ఆ బాలిక వద్దకు వెళ్లాయి. వెంటనే ఆ బాలిక భర్తను ఛీకొట్టి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో కలిసి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం ఊరంతా పాకింది. చివరకు యువకుడి బంధువులు కుల పెద్దలతో రాజీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ యువతి మాత్రం తన తల్లిదండ్రుల సాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్తను అరెస్టు చేయించి.. తాను ఎక్కడా వెనక్కు తగ్గనని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ కావడంతో వాడు భర్తా, పశువా ? అని మండిపడుతున్నారు.