ప్రజెంట్ ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అదే దర్శకధీరుడు రాజమౌళి. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ .రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగ రాసింది .కనీ విని ఎరుగని రేంజ్ లో లాభాలను తీసుకొచ్చి మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది .కాగా ఈ సినిమాలో హీరోలుగా నటించిన మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ప్రాణం పెట్టినటించారు. అందరూ హీరోలు డబ్నుల కోసం సినిమాలు తీస్తే ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఈ సినిమా విషయంలో నటనపరంగా మెప్పించి నటన అంటే ఇది అనేది ప్రూవ్ చేశారు .
కాగా ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు నామినేషన్ ఫైనల్ లిస్టులో సెలెక్ట్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు ఫైనల్ లిస్టులోకి ఆడ్ అయింది. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే ఈ అవార్డు అందుకుంటుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్టే అదే జరిగింది . కాగా కొన్ని గంటల ముందే ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ అనౌన్స్ చేశారు అకాడమీ. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎవ్వరు సాధించని ఘనతను సాధించాడు రాజమౌళి . ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది . ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకుంది . మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ..లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు . ఈ క్రమంలోనే స్టేజిపై తన ఆనందాన్ని పాట రూపంలోనే వ్యక్తం చేశారు కీరవాణి.
ఈ పాట హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సింగర్స్.. అయితే మరో రీజన్ లిరిక్స్ అనే చెప్పాలి . అచ్చమైన నాటు తెలుగు పదాలను వాడుతూ చంద్రబోస్ వల్గారిటీ లేకుండా చిన్నపిల్లలు సైతం అలవోకగా పలికే పదాలను తీసుకొని ఎంతో అర్థం వచ్చేలా రాశారు. కాగా చంద్రబోస్ ఈ పాటని కేవలం రెండంటే రెండు గంటల్లోనే రాసేసారట. అంతేకాదు అది కూడా రాత్రి ఒంటిగంట ప్రాంతంలో చంద్రబోస్ ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ రాసారని గతంలో ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తుంది . అంతేకాదు చంద్రబోస్ ఈ పాట కోసం ఏ విధంగా కూడా కష్టపడలేదా .
తన కళ్ళు మూసుకొని సిచువేషన్ ఊహించుకొని ఒక రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతాడు ..ఆ పంట చేతికొస్తే ఎలా ఫీల్ అవుతాడు ..అని ఊహించుకొని చంద్రబోసే ఆ ప్లేస్ లో ఉండి ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ పాట రాశారట . అందుకే పాట అంత చక్కగా వచ్చింది . ఇప్పటికి ఈ పాట మనం ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది … అంటే దానికి ప్రధాన కారణం చంద్రబోస్ రాసిన లిరిక్స్ అని చెప్పాలి. ఇలాంటి పాటలు మరెన్నో చంద్రబోస్ రాయలి అని అంటూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు జనాలు..!!