టాలీవుడ్ లో ఒకప్పటి యంగ్ క్రేజీ హీరో తరుణ్ దివంగత వర్ధమాన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రేమాయణం ఓ సంచలనం. వీరిద్దరూ కలిసి పిచ్చిపిచ్చిగా ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. ఆర్తి అగర్వాల్ కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నప్పుడే తరుణ్ తో పీకలోతు ప్రేమలో పడిపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి రవిబాబు దర్శకత్వంలో సోగ్గాడు సినిమాలో నటించారు. సోగ్గాడు సినిమా టైమ్ లో తరుణ్ ఆర్తి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని గాఢమైన ప్రేమలోకి వెళ్లిపోయారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆర్తిని పెళ్లి చేసుకోవడం తరుణ్ తల్లి రోజారమణికి ఇష్టం లేదు.
సినిమా అమ్మాయిని తన ఇంటికి కోడలుగా చేసుకోవడం రోజారమణికి ఇష్టం లేదని అందుకే ఆర్తిని కోడలుగా స్వీకరించలేదని అంటారు. ఇదే విషయమై రోజా రమణి తో పాటు తరుణ్ చాలాసార్లు మీడియాకు క్లారిటీ ఇచ్చారు.ఆర్తి అగర్వాల్ ప్రేమ విషయంలో తన తల్లిని నిందించటం తగదని తరుణ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇదిలా ఉంటే రోజా రమణి సైతం ఆర్తి అగర్వాల్ తరుణ్ ప్రేమ గురించి మాట్లాడుతూ కేవలం ఆమెతో మాత్రమే కాదు ప్రియమణితోనూ తరుణ్ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయని రోజా రమణి ఓ సందర్భంలో చెప్పారు.
ఆర్తి అగర్వాల్ ప్రేమ ఫెయిల్ అయ్యాక తరుణ్ ప్రియమణితో కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సందర్భంలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది అన్న పుకార్లు షికార్లు చేశాయి. ఇదే విషయాన్ని తరుణ్ తల్లి కూడా ఓ సందర్భంలో ప్రస్తావించింది. అంతకుమించి వీరిద్దరి మధ్య ఏమీ లేదు ఆ మాటకు వస్తే ప్రియమణికి సీనియర్ హీరో జగపతిబాబుతోను ఏదో ఉందని రకరకాల వార్తలు హల్చల్ చేశాయి.