టాలీవుడ్ లో ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయి డైరెక్టర్ అయిపోయాడు. 22 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమాకు రాజమౌళి దర్శకుడు. అయినా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను ఆయన గురువు రాఘవేంద్రరావు చూసుకున్నారు. ఇక రాజమౌళి రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు రాజమౌళి దర్శకుడు అయినా తెరవెనక రాఘవేంద్రరావు పర్యవేక్షణ ఉండడంతో రాజమౌళికి పూర్తిస్థాయి క్రెడిట్ దక్కలేదు.
ఎప్పుడు అయితే సింహాద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందో.. అక్కడి నుంచి రాజమౌళి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వరుసుగా సై – ఛత్రపతి – విక్రమార్కుడు – మగధీర లాంటి సినిమాలు రాజమౌళి క్రేజ్ ఎక్కడికో తీసుకువెళ్లాయి. ఇక బాహుబలి 1, 2 సినిమాలతో పాటు త్రిబుల్ ఆర్ సినిమా రాజమౌళి అంటే ప్రపంచ స్థాయి విజన్ ఉన్న గొప్ప దర్శకుడు అని కీర్తించేలా ఆయనను ఎక్కడికో తీసుకువెళ్లిపోయాయి.
రాజమౌళి ముందుగా రాఘవేంద్రరావు దగ్గర కొన్ని యాడ్స్ తో పాటు టీవీ సీరియల్స్ కు డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పుడు పూర్తిగా రాఘవేంద్రరావు కనుసన్నల్లోనే రాజమౌళి ఉండేవారు.ఇక ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీయాలని రాఘవేంద్రరావు అనుకున్నప్పుడు.. రాజమౌళిని సీరియల్స్ వదిలేసి సినిమా దర్శకత్వంలోకి రావాలని చెప్పారట. ఎన్టీఆర్ ని తొలి సినిమా హీరో అని చెప్పగానే ఎన్టీఆర్‌ను చూసిన రాజమౌళికి గుండెల్లో బాంబు పేలినంత పనైపోయిందట.
సినిమాలకు దర్శకత్వం వహించడం అనేది నా కల… నా తొలి సినిమాకే ఇలాంటి ? హీరో దొరికాడు ఏంట్రా బాబు అని రాజమౌళి తల పట్టుకున్నారట. ఆ టైంలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండడంతో పాటు చింపిరి జుట్టు మీసం కూడా సరిగా రాకపోవటం.. ఎన్టీఆర్ వాకింగ్ స్టైల్ కూడా అటు ఇటు టకటక నడుస్తున్నట్టుగా ఉండటం.. రాజమౌళికి ఎంత మాత్రం నచ్చలేదట. ఈ హీరోతో సినిమా తీసి ఎలా ? హిట్ కొట్టాలిరా అని లోలోన మదన పడిపోయాడట. అయితే రాజమౌళి ముందు నుంచి ఒక సిద్ధాంతాన్ని బాగా నమ్ముకున్నారు.
కుంటి గుర్రంతో కూడా రేసును గెలిస్తేనే మజా ఉంటుందని… హీరో బాగున్నా… బాగోకపోయిన తాను సినిమా బాగా తీస్తే తనకు మంచి పేరు వస్తుంది ? కదా అని డిసైడ్ అయ్యాడట. అయితే పది రోజులు షూటింగ్ జరిగిన వెంటనే ఎన్టీఆర్ స్టామినా… ఎన్టీఆర్ టాలెంట్ ఏంటో తనకు పూర్తిగా అర్థమైపోయింది అని.. చివరకు ఆ సినిమా కోర్టు సెల్లో ఎన్టీఆర్ నటన చూసి మెస్మరేజ్ అయిపోయానని రాజమౌళి చెప్పారు. అలా వారిద్దరి కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు రాగా… నాలుగు సూపర్ హిట్ అయ్యాయి.