పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీతో అటు రాజకీయాల్లో బిజీగా ఉంటేనే ఉంటూనే ఇటు వరుసపెట్టి సినిమాలకు కూడా చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో రెండు ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక సముద్రఖని దర్శకత్వంలో తన మేనల్లుడు సాయితేజ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ సీతం రీమిక్స్ షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అలాగే సాహో తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇలా ఒకేసారి పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ఈ నాలుగు సినిమాల షూటింగ్ వచ్చే ఆగస్టు.. సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఆ తర్వాత వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సినిమాలకు బల్క్ డేట్స్ కాకుండా డే కాల్ షీట్స్ ని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు ఇస్తున్నాడంట. అంటే పవన్ కళ్యాణ్ డే కాల్ షీట్స్ ప్రకారమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అంటే పవన్ ఒక్కరోజు షూటింగ్ కు వస్తే మనకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం మూడున్నర కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని టాక్.
పది రోజులు కాల్ షీట్లు ఇస్తే ఏకంగా రు. 35 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చు కోవాల్సి ఉంటుంది. అసలు ఇది వింటుంటేనే గుండె హార్ట్ బీట్ స్పీడ్ అవుతోంది. ఏదేమైనా పవన్ రేంజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు ఈ రెమ్యునరేషనే పెద్ద ఉదాహరణ. వచ్చే యేడాది ఎన్నికల నేపథ్యంలో నిర్మాతలు, దర్శకులు చాలా జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేసుకుంటారని పవన్ ఇలా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.