Moviesపెళ్లి కాకుండానే ఎంగేజ్మెంట్‌తోనే బ్రేక‌ప్ చెప్పేసిన ఎన్టీఆర్ విల‌న్‌...!

పెళ్లి కాకుండానే ఎంగేజ్మెంట్‌తోనే బ్రేక‌ప్ చెప్పేసిన ఎన్టీఆర్ విల‌న్‌…!

సినిమా రంగంలో ఇటీవల ప్రేమలు, బ్రేకప్ లు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు ? ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరు పెళ్లి చేసుకున్న ఒకటి రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారు. మరికొన్ని జంటలు పిచ్చిపిచ్చిగా ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు.

ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతగాడు మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, శక్తి రెండు సినిమాలలోనూ పవర్ఫుల్ విలన్ గా నటించాడు. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తుపాకీ సినిమాలోనూ విల‌న్ గా అదరగొట్టేశాడు. జమ్వాల్ ముందు బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

కమాండోస్ సీక్వెల్, ఖుదా హఫీజ్, జంగ్లీ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. కొంతకాలంగా నందిత మహత్వానీ అనే ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబర్ లో ఈ దంపతులకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అక్కడ నుంచి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. బాగా ఎంజాయ్ కూడా చేశారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇటీవల అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన ఈ జంట ఎడమొహం.. పెడమొహంగా కనిపించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్ లో కూడా తమ బ్రేకప్ కొటేషన్స్ షేర్ చేశారు. బాలీవుడ్‌లో చాలా క్యూట్ కపుల్ గా కనిపించిన ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పి ఫ్యాన్స్ కు పెద్ద షాకే ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news