Moviesఎన్టీఆర్ - ల‌క్ష్మి ప్ర‌ణ‌తి పెళ్లికి ముందు ఇంత క‌థ న‌డిచిందా…!

ఎన్టీఆర్ – ల‌క్ష్మి ప్ర‌ణ‌తి పెళ్లికి ముందు ఇంత క‌థ న‌డిచిందా…!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తోంది అంటే దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో కూడా ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించేశాడు. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్‌కు కేవలం 21 సంవత్సరాలు వయసులోనే తిరుగులేని స్టార్‌డ‌మ్‌ వచ్చేసింది. ఎన్టీఆర్ లో కలుపుగోలుతనం.. మాట తీరు, మర్యాదకు ఎంతోమంది అభిమానులు ఫిదా అయిపోతారు.

ఎన్టీఆర్ తనకు వరుసకు మేనకోడలు అయ్యే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి పెళ్లి జ‌రిగింది. చంద్ర‌బాబు నాయుడు మేన‌కోడ‌లు కుమార్తెనే ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. అంటే ఎన్టీఆర్‌కు ల‌క్ష్మి ప్ర‌ణ‌తి వ‌రుస‌కు అక్క కూతురు అవుతుంది. ఈ దంపతులకు భార్గవ్ రామ్‌, అభయ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా లీడ్‌ చేస్తున్నాడు.

ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి భ‌ర్త చాటు భార్యే. ఎన్టీఆర్ తోటి హీరోల భార్య‌లు సోష‌ల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ర‌చ్చ లేపుతూ ఉంటారు. అయితే వీటికి ల‌క్ష్మి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్‌, ల‌క్ష్మి పెళ్లికి ముందు చాలా క‌థ న‌డిచింద‌ట‌. ఈ విష‌యాన్ని ఎన్టీఆరే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. పెళ్లి చూపుల్లోనే ఎన్టీఆర్ షాకింగ్ ప్ర‌శ్న‌లు వేసినా ప్ర‌ణ‌తి మాత్రం అస్స‌లు ఎన్టీఆర్ వైపు త‌లెత్తే చూడ‌లేద‌ట‌.

ఆ త‌ర్వాత మాట్లాడిన‌ప్పుడు కూడా ఈ పెళ్లి ఇష్ట‌మేనా ? అన‌డిగితే అప్పుడు కూడా స‌మాధానం చెప్ప‌లేద‌ట‌. ఇక ఎంగేజ్‌మెంట్‌కు, పెళ్లికి మ‌ధ్య‌లో 8 నెల‌ల గ్యాప్ వ‌చ్చేసింది. ఈ గ్యాప్‌లో కూడా ఎన్టీఆర్ ల‌క్ష్మి ప్ర‌ణ‌తిని ఎన్నో ప్ర‌శ్న‌లు వేసి ఆమెను మురిపించేందుకు ట్రై చేసేవాడ‌ట‌. అప్పుడు కూడా ల‌క్ష్మి ఆన్స‌ర్లు చెప్ప‌కుండా నో అని మాత్ర‌మే చెప్పేద‌ట‌.

అప్ప‌ట‌కి కాని ఎన్టీఆర్‌కు అడ‌వాళ్ల మ‌న‌స్సులో ఏం ఉందో తెలుసుకోలేం అన్న విష‌యం అర్థం కాలేద‌ట‌. ఆడ‌వాళ్ల మ‌న‌స్సులో ఏం ఉందో తెలిసిన వాడు ప్ర‌పంచాన్నే ఏలుతాడ‌ని ఎన్టీఆర్ చెప్పుకు వ‌చ్చాడు. ముందు ఎంతో సిగ్గుతో ఉండే ల‌క్ష్మి ప్ర‌ణ‌తి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పార్టీల‌కు అటెండ్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news