సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార 15 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిలా కొనసాగుతోంది. 2004 నుంచి దాదాపు 19 సంవత్సరాల పాటు ఒక హీరోయిన్ ఏక చక్రాధిపత్యంగా ఇండస్ట్రీలో కొనసాగటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి గొప్ప అదృష్టం నయనతారకే దక్కింది. నయనతార ఎంత స్టార్ హీరోయిన్గా ఎదిగిందో ఆమె.. వ్యక్తిగత జీవితంలో అన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముందుగా తమిళ్ హీరో శింబూతో ప్రేమాయణం నడిపిన ఆమె ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ దర్శకుడు ప్రభుదేవాతోను లవ్ లో పడింది
వీరిద్దరికి బ్రేకప్ చెప్పేసి తనకంటే వయసులో ఏడాది చిన్నోడు అయినా తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లయ్యాక కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఇక క్రేజ్ వచ్చాక నయనతార ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని.. ఆమె ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ దర్శక నిర్మాతలను కూడా నానా ఇబ్బందులు పెడుతుంది అన్న విమర్శలు ఆమెపై ఉన్నాయి.
రెమ్యూనరేషన్ విషయంలో అనేక కండిషన్లో పెట్టే నయనతార.. సినిమా షూటింగ్ కు రావడంతో పాటు.. సినిమా ప్రమోషన్ల విషయంలోనూ చాలా నిబంధనలు పెడుతున్నారు. ఇక తోటి హీరోయిన్లతో ఆమె ప్రవర్తన కూడా సరిగా ఉండదని తాజాగా బయటపడింది. అసలు తెలుగులో వెంకటేష్ సరసన బాబు బంగారం సినిమాలో నటించినప్పుడు నయనతార పెట్టిన ఇబ్బందికి చిత్ర యూనిట్ బెంబేలెత్తింది. తాజాగా ఎన్టీఆర్ తో యమదొంగా లాంటి సినిమాలో నటించిన మమతా మోహన్‌దాస్ ఇప్పుడు నయనతార పై సంచలన ఆరోపణలు చేసింది.
మమతా మోహన్‌దాస్ ఇటీవల క్యాన్సర్ భారిన పడి కోలుకున్నాక ఆ వెంటనే చర్మవ్యాధికి గురైంది. ప్రస్తుతం ఆమె తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టి కోలుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె నయనతారపై విమర్శలు చేయటం సంచలనంగా మారింది. ఆమె నటించే సినిమాలో మరొక నటి సెట్స్ లో ఉంటే తాను షూటింగ్ కి రానని నయన్ చెప్పినట్టు మమత తెలిపింది. తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కథానాయకుడు సినిమాలో ఒక పాటలో నటించే అవకాశం వచ్చింది. ఆ పాట షూటింగ్ కూడా జరిగింది ఫైనల్ కాపీలో కేవలం ఒక్క షాట్ లో మాత్రమే తాను కన్పించాను అని.. ఇదంతా నయనతార వల్లే అని మమత ఆరోపించింది.
ఈ సాంగ్‌లో మరో హీరోయిన్ ఉందని నాకు ముందుగా చెప్పలేదు.. నేను షూటింగ్ కి రానని నయన్ గొడవ పెట్టుకుందట. ఆమె బలవంతం చేయటం వల్లే నాతో తీసిన షాట్స్ అన్నీ కట్ చేయించారని.. అలా ఆ పాట కోసం నాలుగు రోజులు టైం వేస్ట్ అయిందని.. మమత సంచలన వ్యాఖ్యలు చేసింది. రజినీకాంత్ నయనతార జంటగా వచ్చిన కథానాయకుడు సినిమాలో ఈ పాట షూట్ చేశారు. ఏదేమైనా నయనతార తోటి నటి విషయంలో ఇలా ప్రవర్తించడం సరైనది కాదని మమతా మోహన్‌దాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.