కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార యంగ్ హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందా ..? అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ మీడియా ప్రముఖులు. నయనతార సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంటుంది .
కాగా రీసెంట్గా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. భర్త లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నానాదంటాలు పడుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే నయన్ డబ్బు ను సంపాదించుకోవడానికి ఎలాంటి అవకాశాని మిస్ చేసుకోవట్లేదు అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే నయనతార మరో యంగ్ హీరో సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
లవ్ టుడే సినిమాతో తనకంటూ సపరేట్ గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తో త్వరలోనే నయనతార స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా 8 కోట్లు చార్జ్ చేస్తుందట . కుర్ర హీరో సినిమా అయినా సరే ఏమాత్రం రెమ్యూనరేషన్ తగ్గించుకునేది లేదు అంటూ ఓపెన్ గా చెప్పేస్తుందట.
అంతేకాదు ఈ సినిమాలో నయనతార – ప్రదీప్ తో కూల్ రొమాన్స్ కూడా చేయబోతుంది అంటూ క్రేజీ టాక్ వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే నయనతార కుర్ర హీరోతో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందా ..? డబ్బు కోసం అంత దిగజారిపోయిందా..? అంటూ దారుణమైన కామెంట్స్ తో ఆమె ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు . దీంతో మరోసారి నయనతార పేరు సోషల్ మీడియాలో .. కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!