చాలా తక్కువ టైంలోనే రష్మిక మందన్న నేషనల్ క్రష్మిక అయిపోయింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక తెలుగులో నాగశౌర్య హీరోగా చేసిన ఛలో సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత నితిన్‌తో భీష్మ, వెంటనే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, విజయ్ దేవరకొండతో గీతగోవిందం, డియర్ కామ్రేడ్, అల్లు అర్జున్‌తో పుష్ప ఇలా చెప్పుకుంటూ పోతే రష్మిక వరుసగా సూపర్ డూపర్ హిట్టులతో స్టార్ హీరోల పక్కన అవకాశాలతో దూసుకుపోతోంది. వెంటనే బాలీవుడ్ లోనూ అవకాశాలు వచ్చేసాయి.
ఇటు కోలీవుడ్ లోనూ విజయ్ కి జోడిగా వారసుడు సినిమాలో నటించింది. దీంతో రష్మిక రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు మూడు కోట్లకు కాస్త అటు ఇటుగా డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. రష్మికకు వరుస విజయాలకు తోడు కాస్త పొగరు కూడా పెరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు కన్నడ సినిమా ఇండస్ట్రీ అయితే ఆమె బిహేవియర్ పై తీవ్ర అసహనంతో ఉంది.
ఒకానొక దశలో ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. అవకాశాలు రాకముందు… స్టార్ హీరోయిన్ కాకముందు రష్మిక అణిగిమణిగి ఉండేది అని.. ఎప్పుడూ అయితే ఆమె స్టార్ హీరోయిన్ అయిందో.. అక్కడి నుంచి చిన్నచిన్న హీరోలను, చిన్నచిన్న దర్శకులను ఆమె చిన్నచూపు చూస్తుందన్న విమర్శలు ఆమెపై ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె స్టార్ అయ్యాక ఆమెకు ఆరంభంలో అవకాశాలు ఇచ్చిన వాళ్లను.. ఆమె సింపుల్గా మర్చిపోతుందట.
అలాగే తనకు సాయం చేసిన వాళ్ళనే ఆ తర్వాత చిన్నచూపు చూస్తుందని కూడా ఇండస్ట్రీలో ఆమెపై తరచూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. కన్నడలో ఆమె కాంతారా సినిమాపై చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీసాయి. కాంతారా అంత పెద్ద హిట్ అయినా ఆ సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టిపై చేసిన వ్యాఖ్యలు కన్నడీయులను బాగా హర్ట్ చేశాయి. ఇదిలా ఉంటే తెలుగులో ఆమె తొలి సినిమా హీరో నాగశౌర్యతోను ఆమెకు గ్యాప్ ఉందని అంటారు.
అసలు ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది నాగశౌర్య. ఛలో సినిమాతో తెలుగులోకి వచ్చాక ఆమెకు పట్టిందల్లా బంగారం అయింది. రష్మిక స్టార్ అయ్యాక తనతో సినిమాలు చేసిన అందరిని గుర్తు పెట్టుకుందని.. కానీ నాగశౌర్య పేరు ఎప్పుడూ ప్రస్తావించదని.. తాను స్టార్ హీరోయిన్ అయిపోయాను అన్న ఫీలింగ్ ఆమెలో కలగటమే అందుకుకారణం అని అంటూ ఉంటారు.
అంటే నాగశౌర్య తనకు రేంజ్‌కు సరిపోయే హీరో కాదనే ఫీలింగ్ ఆమెలో ఉండడమే అంటారు. అటు శౌర్య కూడా రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యాక తన పేరు ఎప్పుడు ప్రస్తావించకపోవడంతో బాగా హర్ట్ అయ్యాడంటారు. ఆమె ఛలో సినిమా గురించి ఓ సారి ట్వీట్ వేస్తూ దర్శకుడి పేరు ప్రస్తావించినా ఎక్కడా హీరో, నిర్మాత అయిన శౌర్య గురించి చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా రష్మిక యాట్యిట్యూడే అంటారు.