తెలుగు సినిమా రంగంలో మురళీమోహన్ అంటే ఒక క్రేజ్ ఉండేది. మురళీమోహన్ కెరీర్ ఆరంభం నుంచి చూస్తే వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. మురళీమోహన్ వ్యక్తిత్వం ఎలా ? ఉంటుందో ఆయన సినిమాలు కూడా అలాగే ఉండేవి. మురళీమోహన్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలలో నటించిన ఎంతో మంది హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసినా.. ఏ హీరోయిన్ విషయంలోనూ ఎలాంటి పుకార్లు ఎదుర్కోలేదు.
అయితే ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం మురళీమోహన్ పై చాలా పుకార్లు షికార్లు వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయచిత్ర. 1970వ దశకంలో జయచిత్రకు ఎంతో క్రేజ్ ఉండేది. అప్పట్లో మురళీమోహన్ – జయచిత్ర జంట ఎన్నో సినిమాలలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ జంట అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి చెన్నైలో బయట కనిపిస్తే చాలు ఎన్నో పుకార్లు వచ్చాయి.
ఒకానొక సందర్భంలో వీరిద్దరూ బయట ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న గాసిప్స్ కూడా తమిళపత్రికలు రాసేసాయి. చివరకు ఒకరోజు మురళీమోహన్ షూటింగ్ నిమిత్తం మద్రాసులోని వాహని స్టూడియోకి వెళ్ళినప్పుడు.. అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు నిజం చెప్పు నువ్వు జయ చిత్రను పెళ్లి చేసుకుంటున్నావా ? అని అడిగేసారంట.
దీంతో షాక్ అయిన మురళీమోహన్ తనకు ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.. తాను జయచిత్రను పెళ్లి చేసుకోవడం ఏంటని స్టన్ అయ్యారట. అయితే ఈ పుకార్ల వెనక దర్శకుడు దాసరి నారాయణరావు చేసిన ఒక పని ప్రధానంగా కారణం అయ్యింది. దాసరి దర్శకత్వంలో కలిసి వీరిద్దరూ కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సమయంలో మురళీమోహన్ కు మొహమాటం ఎక్కువగా ఉండేదట.దీంతో దాసరి వాళ్ళిద్దరికీ స్క్రిప్ట్ ఇచ్చి.. మీరు ఇద్దరూ కలిసి డైలాగులు చదువుకోండి అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగితే సీన్లలో నటించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారట.
అలా వారిద్దరు సినిమాకి ముందు డైలాగులు చదువుకునే సమయంలో బాగా సన్నిహితులు అయిపోయారట. ఆ స్నేహంతోనే బయట కూడా కలిసేవారట. ఇది చూసిన కొందరు వారిద్దరు ప్రేమలో పడిపోయారని.. మురళీమోహన్ జయచిత్ర లేకుండా ఉండలేకపోతున్నాడని.. ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు అల్లేశారు. దీనిని ఒకటి రెండు తమిళ పత్రికలు రాసేశాయి. అలా వీరిద్దరు పెళ్లి వార్తలు అప్పట్లో హైలైట్ అయ్యాయి.