టాలీవుడ్ లో సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టైల్ వేరు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందుకే మోహన్ బాబుకు ఇండస్ట్రీలో శత్రువులు కన్నా మిత్రులు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఏం చెప్పాలనుకుంటారో అది ముఖం మీద చెప్పేస్తారు.. అందుకే మోహన్ బాబు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. పైగా రాజకీయంగా అన్ని పార్టీలకు చెందిన వారితోను ఆయనకు మిత్రత్వం ఉంది.
తాజాగా మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్.. కర్నూలు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. మనోజ్ కు ముందుగా తన వదిన వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో ప్రేమ వివాహం జరిగింది. ఆ తర్వాత నాలుగేళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక మనోజ్ – మౌనిక రెడ్డి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో వీరి మధ్య సరికొత్త ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది.
ఇదిలా ఉంటే మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచి విష్ణు… ఆయన భార్య వెరోనికా కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లికూడా మోహన్ బాబుకు ఇష్టం లేదట. మోహన్ బాబు, రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులు. మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. అప్పటి నుంచి ఢిల్లీలో మొదలైన వీరి స్నేహం కొనసాగింది.
మోహన్ బాబుకు తన పెద్ద కొడుకు విష్ణును ఐపీఎస్ ఆఫీసర్‌ను చేయాలన్న కోరిక బలంగా ఉండేదట. అయితే విష్ణు చివరకు నటుడు అయ్యాడు. చివరకు తాను చూసిన అమ్మాయిని అయినా పెళ్లి చేసుకోవాలని మోహన్ బాబుకి కోరికగా ఉండేదట. అయితే విష్ణు వెరోనికాను ప్రేమించి.. తను ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మోహన్ బాబు బాగా కోపానికి గురయ్యారట.
అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు బ్రహ్మానందం, మరో దర్శకుడు కోదండ రామిరెడ్డి ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు మోహన్ బాబు దగ్గరికి వెళ్లి విష్ణు ఇష్టపడినప్పుడు నీకు అభ్యంతరం ? ఎందుకు… జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళు కదా అని నచ్చ చెప్పారు. మోహన్ బాబు ముందు అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నారట. అయితే ఇప్పుడు జంట చాలా అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్‌ను గడుపుతుంది ఈ జంటకు నలుగురు పిల్లలు