ఈ టైటిల్ చూడటానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇది పక్కా నిజం. ఈ విషయాన్ని టాలీవుడ్ లో ఒక సీనియర్ డైరెక్టర్ స్వయంగా చెప్పిన మాట. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను డైరెక్టర్ అయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేసారట. మరి త్రివిక్రమ్ అలా ఎందుకు ? చేశారు.. అసలు ఏం జరిగిందో ? తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2005 లో జై చిరంజీవ సినిమా తెరకెక్కింది. వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు.
చిరంజీవికి జోడిగా భూమిక చావ్లా, సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించారు. సినిమాలో కామెడీ ఉన్న సరైన కథాబలం, దమ్మున్న రచన లేకపోవడంతో సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మాటల సహకారం అందించారు. అంతకుముందు త్రివిక్రమ్ – విజయభాస్కర్ కాంబినేషన్లో వరుసగా మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
అదే నమ్మకంతో విజయభాస్కర్ ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ ను పెట్టుకున్నారు. కానీ త్రివిక్రమ్ అదే సమయంలో మహేష్ బాబుతో అతడు సినిమాను తెరకెక్కించారు. మహేష్ బాబుతో ఛాన్స్ రావడంతో ఆ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేసిన త్రివిక్రమ్.. జై చిరంజీవ సినిమాను పెద్దగా పట్టించుకోలేదని అందుకే కథలో దమ్ము లేకుండా పోయిందని.. మాటలు కూడా సరిగా రాలేదని విజయభాస్కర్ ఒకటి రెండు సందర్భాల్లో వాపోయారు.
ఆలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాతో తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు చిరంజీవి సినిమాను పట్టించుకోకపోవడంతో జై చిరంజీవ ప్లాప్ అయిందని విజయభాస్కర్ ఆరోపణ. ఇక ఆ సినిమా ప్లాప్ అయ్యాక విజయభాస్కర్ తిరిగి ఇండస్ట్రీలో నిలతొక్కుకోలేదు క్రమక్రమంగా ఆయన తెరమరుగు అయిపోయారు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యారు.