ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా లవ్ ఫెయిల్యూరా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . స్వయానా ఈ విషయాన్ని చిరంజీవియే చెప్పుకు రావడం సంచలనంగా మారింది . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రెసెంట్ నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ హీరోస్ ఉన్నా సరే ..సరికొత్త కంటెంట్ తో చిరంజీవి దూసుకుపోతున్నాడు .
ఈ క్రమంలోనే రీసెంట్గా వాల్తేరు వీరయ్య – గాడ్ ఫాదర్ సినిమాల తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో లాల్ సింగ్ చద్ద ప్రమోషన్స్ కోసం చిరంజీవి హెల్ప్ తీసుకున్నప్పుడు ..ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి లవ్ ఫెయిల్యూర్ ఓపెన్ గా నే చెప్పుకొచ్చారు. ” ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని చూసి ప్రేమించానని ..ఆ అమ్మాయి తనకి సైకిల్ నేర్పించేదని ..అప్పట్లో అది నాకు చాలా కొత్తగా అనిపించిందని.. ఆ తర్వాత అది రాను రాను అట్రాక్షన్ అని తెలుసుకొని కామ్ గా వదిలేశానని” చెప్పారు.
ఈ విషయం సురేఖాకి కూడా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు . ఆ అమ్మాయి మరెవరో కాదు చిరంజీవి ఇంటి పక్కనే ఉండే అంకుల్ కూతురు అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఇలా చిరంజీవి తను లవ్ చేయకుండానే లవ్ ఫెయిల్యూర్ అంటూ ట్యాగ్ వేయించుకున్నారు. ప్రజెంట్ చిరంజీవి భోలా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత కూడా మంచి మంచి లైన్స్ ను రెడీగా పెట్టుకుని ఉన్నాడు..!!