Moviesపెళ్ళి చేసుకున్న వారానికే మనోజ్ సంచలన నిర్ణయం.. మంచు ఫ్యామిలీకి...

పెళ్ళి చేసుకున్న వారానికే మనోజ్ సంచలన నిర్ణయం.. మంచు ఫ్యామిలీకి కొత్త తిప్పలు తప్పవా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న మంచి మోహన్ బాబు పేరు చెప్తే జనాలు ఇచ్చే రియాక్షన్ వెరైటీగా ఉంటుంది. పద్ధతికి మరో మారుపేరు డిసిప్లైన్ కి పర్యాయపదాలుగా మంచు కుటుంబాన్ని చెప్పుకొస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీ లో ఉండే జనాలు. మరీ ముఖ్యంగా మోహన్ బాబు ఎంత డిసి ప్లేన్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా అంతే క్రమశిక్షణగా మెలుగుతారు.. ఎదుగుతారు అన్న టాక్ ఎప్పటినుంచో వినిపిస్తుంది . కాగా ఆయన కొడుకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచి విష్ణు , మంచు మనోజ్ కూడా హీరోలుగా కొనసాగడానికి.. ఇంకా హీరోలుగా సెటిల్ అవ్వడానికి తాపత్రయపడుతూనే ఉన్నారు.

కాగా మంచు మనోజ్ రీసెంట్ గానే దివంగత రాజకీయనేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు . దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత ధూమ్ ధామ్ అంటూ భారీ సెక్యూరిటీ మధ్య అత్తగారింటికి వెళ్లిన మనోజ్ ఏ రేంజ్ లో హంగామా చేశారు అందరూ చూసిందే. భూమా మౌనిక రెడ్డి ఇంట్లో కూడా మనోజ్ కు ప్రత్యేక ఘనస్వాగతం లభించింది. కాగా రీసెంట్గా మంచు మనోజ్ కి సంబంధించిన పర్సనల్ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మనకు తెలిసిందే ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ విడాకులు ఇచ్చేశారు . వీళ్ళకి అప్పటివరకు పిల్లలు లేరు. భూమా మౌనిక రెడ్డికి మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. అయితే మంచు వారసుడిగా భూమ మౌనిక రెడ్డి కొడుకుని ప్రకటించడానికి మంచు మనోజ్ సర్వం సిద్ధం చేసుకున్నాడట . భూమా మౌనిక రెడ్డిని భార్యగా యాక్సెప్ట్ చేసిన మంచు మనోజ్ ..ఇంకో బిడ్డను కనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఆ బాబునే తన కొడుకుగా అనుకొని మంచు వారసుడిగా తనకు అన్ని గౌరవాలు దక్కేటట్లు సర్వం సిద్ధం చేశారట.

ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు సైతం మనోజ్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది . ఎవరికో పుట్టిన బిడ్డని మంచు వారసుడిగా ప్రకటించడానికి మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయం అస్సలు నచ్చడం లేదట . ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని .. త్వరలోనే మంచు ఫ్యామిలీ రెండుగా చీలిపోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మంచు మనోజ్ కానీ మంచు విష్ణు గాని మంచు మోహన్ బాబు గానీ ఏ విధంగా స్పందించలేదు . ఇది ఫేక్ న్యూస్ నా..? లేదా ఎవరో పుట్టించిన పుకార్లా..? నిజంగానే జరగబోతుందా..? అని తెలియాలంటే మంచు ఫ్యామిలీ నుంచి ఎవరైనా నోరు విప్పి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news