Moviesmanchu Manoj మంచు ఫ్యామిలీకి మ‌నోజ్ - మౌనిక పెళ్లి ఇష్టంలేదా......

manchu Manoj మంచు ఫ్యామిలీకి మ‌నోజ్ – మౌనిక పెళ్లి ఇష్టంలేదా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇందుకు మంచు మ‌నోజ్ చేసిన ట్వీట్ కూడా కార‌ణం అంటున్నారు. విష‌యంలోకి డైరెక్టుగా వెళితే మోహ‌న్‌బాబు రెండో కుమారుడు మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక ఇద్ద‌రు రెండో పెళ్లితో కొత్త వైవాహిక బంధంలోకి ఎంట‌ర్ అయ్యారు. ఇది వీరిద్ద‌రికి రెండో పెళ్లి. మ‌నోజ్‌కు ముందు భార్య‌తో పిల్ల‌లు లేరు. కానీ మౌనిక‌కు మాత్రం మొద‌టి భ‌ర్త‌తో ఓ బాబు ఉన్నాడు.

పాత స్నేహాల నేప‌థ్యంలో వీరు మ‌ళ్లీ క‌లుసుకుని ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ‌నోజ్ అక్క మంచు ల‌క్ష్మి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఈ పెళ్లిని త‌న ఇంట్లోనే చేయ‌డంతో పాటు ఇండ‌స్ట్రీ వాళ్ల‌ను, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించ‌డం ద‌గ్గ‌ర నుంచి ఆమే చూసుకున్నారు. పెళ్లి ముగిసింది. పెళ్లి త‌ర్వాత మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అనేకానేక చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది.

మ‌నోజ్ ల‌వ్ యు అక్కా.. నువ్వు చేసిన ప్రతిదానికి చాలా కృత‌జ్ఞ‌త‌లు… ఏ జ‌న్మ‌పుణ్య‌మో కాని.. నువ్వు నాకు అక్క‌గా దొరికావు అంటూ పోస్ట్ చేశాడు. కేవ‌లం మ‌నోజ్ త‌న అక్క‌ను మాత్ర‌మే మెచ్చుకోవ‌డం… కాదు కాదు ఆకాశానికే ఎత్తేసేలా ప్ర‌శంసించాడు. ఈ పోస్టులో త‌న త‌ల్లిదండ్రులు, అన్న విష్ణు గురించి ఎక్క‌డా కామెంట్ చేయ‌లేదు… వారి ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు.

ఇక ముందు నుంచి కూడా ఈ పెళ్లి మోహ‌న్‌బాబుకు ఇష్టం లేద‌న్న ఓ టాక్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనికి త‌గ్గ‌ట్టుగానే పెళ్లిలోనూ మోహ‌న్‌బాబు అంత హుషారుగా లేర‌నే అంటున్నారు. మ‌నోజ్ మొద‌టి పెళ్లిలో మోహ‌న్‌బాబు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. మ‌నోజ్ మొద‌టి పెళ్లికి సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన వారు అంద‌రూ క‌ద‌లివ‌చ్చారు. అంగ‌రంగ వైభ‌వంగా ఈ పెళ్లి జ‌రిగింది.

ఇక ఇప్పుడు పెళ్లిలో మోహ‌న్‌బాబు అంత సంతోషంగా లేరని.. విష్ణు కూడా కొద్ది సేపు మాత్ర‌మే అక్క‌డ ఉండి వెళ్లిపోయారనే ఎక్కువ మంది అంటున్నారు. మామూలుగా విష్ణు హ‌డావిడి ఉంటే ఫొటోల్లోనూ మ‌నోడే ఉండేవాడు. కానీ ల‌క్ష్మి అంత రోల్ ప్లే చేయ‌లేదు. దీంతో విష్ణు, ఆయ‌న భార్య వెరోనికా ఫొటోలు కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. ఇక మోహ‌న్‌బాబు ఫంక్ష‌న్లో అంద‌రితోనూ అంత స‌ర‌దాగా కూడా ఉండ‌లేద‌నే టాక్ వ‌చ్చింది.

మామూలుగా మోహ‌న్‌బాబు ఎక్క‌డ ఉంటే అక్క‌డ మంచి స‌ర‌దా ఉంటుంది.. జోకులు పేలిపోతాయి. కానీ ఈ ఫంక్ష‌న్లో ఆయ‌న‌లో ఎంతో కొంత ముభావం క‌నిపించింది. ఇక మ‌నోజ్ పెట్టిన పోస్టులో త‌న పెళ్లి బాధ్య‌త నెత్తికెత్తుకుంది మొత్తం త‌న అక్కే అన్న‌ట్టుగా చెప్పాడు. ఇక్క‌డ మిగిలిన కుటుంబ స‌భ్యుల గురించి మాట మాత్రం అయినా చెప్పక‌పోవ‌డంతో స‌రికొత్త చ‌ర్చ‌కు అయితే తెర‌లేచింది. ఏదేమైనా మ‌నోజ్ ఈ వైవాహిక బంధంతో త‌న జీవితాన్ని స‌రికొత్త‌గా ప్రారంభించాల‌ని ఆకాంక్షింద్దాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news