సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ ..ముకుంద సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా ద్వారా కూల్ క్లాసిక్ హీరో గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటిస్తున్నాడు .
అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతుంది . రీసెంట్గా ఇదే విషయంపై లావణ్య త్రిపాఠి స్పందించింది . ఆమె రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ “పులి – మేక ” రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకునింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య కు పెళ్లి పై ప్రశ్న ఎదురైంది . అయితే దీనిపై వ్యంగ్యంగా స్పందిస్తూ ..”లావణ్య కౌంటర్ వేసింది . మీ దృష్టిలో ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లలో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి అంతేనా..? నేను ఆ టైప్ కాదు ..నేను ఇండస్ట్రీలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నా కాన్సన్ట్రేషన్ అంత సినిమాలపైనే ఉంది . ఇప్పట్లో పెళ్లి గిల్లి అంటూ ఏమీ ఆలోచించను ” అంటూ ఒక్క మాటతో కొట్టి పడేసింది.
అంటే మెగా హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు పై కూడా లావణ్య ఘాటుగా కౌంటర్ వేసింది. హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంటి అబ్బాయితో పెళ్లి అని రూమర్లు వచ్చిన లావణ్య ఈ రేంజ్ లో కొట్టి పడేయడం మెగా హీరోని ఇన్ సల్ట్ చేసిన్నట్లే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పేరు వైరల్ గా మారింది..!!