సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నందమూరి కుటుంబ సభ్యులు అంటే జనాలకు అదో తెలియని గౌరవం . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేశారు నందమూరి తారక రామారావు గారు . ఇప్పటికీ నందమూరి అనే పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తారక రామారావు గారే. ప్రజెంట్ ఆయన వారసులుగా ఇండస్ట్రీలో నందమూరి హీరోలు రాజ్యమేలేస్తున్నారు .
అభిమానుల కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను చూస్ చేసుకుని.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు . అదే లిస్టులోకి వస్తాడు నందమూరి తారకరామా రావు గారి మనవడు కళ్యాణ్ రామ్ . రీసెంట్ గానే బింబిసారా, అమిగోస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్.. బింబిసారా 2 ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.
ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ రామ్ కి తాతకు తగ్గ మనవడు మీరు అంటూ ఓ కాంప్లిమెంట్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన రెస్పాండ్ అవుతూ ..”దయచేసి అలా అనకండి,,ఆయనతో నన్ను పోల్చకండి. ఆయన లాంటి వాళ్లు ఎవరు ఉండరు. ఆయన ఒక్కడే ఉంటారు . ఆయన స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు . ఆయన స్థాయికి నేను ఎదగలేను . ఆయన ప్లేస్ కి నేను రీచ్ అవ్వలేను.. “అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది నందమూరి హీరోల దగ్గర నుండే నేర్చుకోవాలి..!!