మన తెలుగులో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఇప్పుడు ఏకంగా చుక్కల్లోనే కనపడుతోంది. యేడాదికి యేడాదికి, సినిమా.. సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూనే పోతున్నారు. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. హీరోయిన్లకు ఒకటి రెండు హిట్లు పడితే చాలు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. కోట్లలోనే పెంచేస్తున్నారు.
ఇక ఇప్పుడు అంతా పాన్ ఇండియా మయం అయిపోయింది. స్టార్ హీరోలతో పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటే హీరోల రెమ్యునరేషన్లు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టులో హీరోయిన్‌గా జాన్వీకపూర్ సెట్ అయ్యింది. అసలు తెలుగులో జాన్వీని నటింప జేసేందుకు గత రెండు మూడేళ్లుగా చాలా ప్రయత్నాలే జరిగాయి.
ఆమె ఓ పట్టాన ఒప్పుకోలేదు. బాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఆమె తెలుగు సినిమాను చిన్న చూపే చూసింది. కానీ ఆమె తల్లి శ్రీదేవిని స్టార్‌ను చేసింది ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీయే అన్న విషయం కూడా ఆమె మర్చిపోయినట్టు ప్రవర్తించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఆరంగ్రేటమే కాదు.. సౌత్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది.
ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ ఎప్పుడు జాయిన్ అవుతుందా ? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నటించేందుకు జాన్వీకి రు. 5 కోట్లు ఆఫర్ చేస్తేనే.. ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. ఆమెకు ఇప్పుడు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇది చాలా ఎక్కువ అనే ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తే కాని.. ఆమె ఈ సినిమాలో చేసేందుకు కన్విన్స్ కాలేదంటున్నారు.
ఎవరో ఎందుకు ? అసలు బాలీవుడ్ భామలు సౌత్ సినిమాల్లో చేయడం అంటేనే కోట్లు డిమాండ్ చేసేస్తున్నారు. కియారా అద్వానీ రామ్‌చరణ్ -శంకర్ సినిమా చేసేందుకు అక్షరాలా రు. 4 కోట్లు పుచ్చుకుంటోంది. దీనికి తోడు జీఎస్టీ కూడా అదనమే..! ఈ లెక్కన చూస్తే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లను తెలుగులో నటింపజేయాలంటే అక్షరాలా రు. 5 కోట్లకు కాస్త అటూ ఇటూగా సమర్పించుకోవాల్సిందే..!
ఇక ప్రాజెక్ట్ కే కోసం నటిస్తోన్న దీపికా పదుకొణేకు అయితే రు. 10 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ముట్టిందంటున్నారు. ఇక జాన్వీకి రు. 5 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు ఆమెకు ఫైవ్‌స్టార్ హోటల్స్, ఆమెతో పాటు వచ్చే ఇద్దరు, ముగ్గురు టీం ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలన్న కండీషన్ కూడా పెట్టిందట. ఇవన్నీ చూస్తుంటే తడిసి మోపెడు అయ్యేలా ఉన్నాయి.