సినిమా రంగంలో హీరోల మధ్య, హీరోయిన్ల మధ్య ఇగోలు.. పంతాలు పట్టింపులు మామూలుగా జరుగుతూ ఉంటాయి. అయితే అవి ఎప్పటినుంచే కాదు సినిమా రంగం ప్రారంభమైన తొలినాళ్ల నుంచి నడుస్తూ ఉన్నవే. ముఖ్యంగా 1970 – 1980వ దశకంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల మధ్య ఇలాంటి పంతాలు, పట్టింపులు ఉండేవి. విజయనిర్మలకు జయప్రదకు పడేది కాదని అంటారు. ఇందుకు సూపర్ స్టార్ కృష్ణ కారణం అని టాక్ ఉంది. అలాగే జయసుధకు.. జయప్రదకు గొడవలు ఉండేవి. అలాగే అతిలోకసుందరి శ్రీదేవికి.. జయప్రదకు కూడా ఏమాత్రం పడేది కాదని అంటారు.
జయప్రద స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలో వచ్చిన శ్రీదేవి.. జయప్రద అవకాశాలకు చాలా వరకు గండి కొట్టేసింది. ఆ టైంలో జయప్రదకు రావలసిన కొన్ని అవకాశాలు శ్రీదేవికి వెళ్ళిపోవడం.. శ్రీదేవికి రావాల్సిన కొన్ని ఛాన్సులు జయప్రదకు వెళ్లిపోవడం జరిగేవి. మధ్యలో ఈ ఇద్దరు హీరోయిన్ల పిఆర్వోలు పోవాటా పోటీగా ఒకరి అవకాశాలను మరొకరికి వచ్చేలా చక్రాలు తిప్పేవారు. దీంతో ఇద్దరి మధ్య బాగా ఈగో పెరిగిపోయింది.
అయితే ఆ సమయంలో దర్శకరత్న దాసరి నారాయణరావు తన సినిమాలలో ఎక్కువగా జయప్రదను హీరోయిన్గా పెట్టుకునేవారు. అయితే దాసరి శ్రీదేవిని తన సినిమాతోనే హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో జయప్రదను కాకుండా శ్రీదేవిని ప్రమోట్ చేయడం ప్రారంభించారు. అది జయప్రదకు నచ్చలేదు. దీంతో జయప్రద గురువుగారు దాసరి నారాయణరావు పై ఫైర్ అయిపోయిందట.
నేను మీకు ఎంతగానో కోపరేట్ చేస్తున్నాను.. మీరు ఏ సినిమాకు ఎన్ని ? రోజులు డేట్లు అడిగినా కాదనకుండా ఇస్తున్నాను… కానీ మీరు నన్ను పట్టించుకోకుండా శ్రీదేవిని ఎందుకు ? ప్రమోట్ చేస్తున్నారని దాసరి ముందు తన ఆవేదన వెళ్లగక్కేసారట. అయితే శ్రీదేవి చాలా తెలివైనది కావడంతో ఆమె రాఘవేంద్రరావు క్యాంపులోకి వెళ్లిపోయిందట.
అక్కడ నుంచి రాఘవేంద్రరావు శ్రీదేవిని ఎక్కువగా ప్రమోట్ చేయడం ప్రారంభించారు. ఆ టైంలో ఎన్టీఆర్ హిట్ సినిమాలు అన్నింటిలోనూ శ్రీదేవే హీరోయిన్‌గా ఉండేవారు. దీంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఇక దాసరి ఎక్కువగా తన సినిమాలలో జయప్రదకు ఛాన్సులు ఇస్తూ.. మధ్య మధ్యలో శ్రీదేవిని కూడా పెట్టుకుంటూ ఉండేవారు. అలా ఆ టైంలో శ్రీదేవి – జయప్రద మధ్య ఇంతలా ఇగోలు నడిచేవని అంటారు.