Moviesఅంజ‌లీదేవి పెళ్లి వెన‌క ఇంత స్టోరీ ఉందా… ఆ హీరోతో ప్రేమ‌లో...

అంజ‌లీదేవి పెళ్లి వెన‌క ఇంత స్టోరీ ఉందా… ఆ హీరోతో ప్రేమ‌లో కూడానా…!

మ‌హాన‌టి అంజ‌లీదేవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అనార్క‌లి సినిమాతో అప్ప‌టి యువ‌త రం గుండెల్లో పాగా వేసిన హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సినిమాల్లో ప్రేమ కాన్సెప్ట్ నే ఎక్కువ‌గా ఆమె తీసుకున్నారు. నిజానికి సినీరంగంలో ప్రేమ కాన్సెప్టుతో మూవీల్లో యాక్ట్ చేసిన వారు త‌ర్వాత కాలంలో ఒక ఇంటివారు అయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

గీతాంజ‌లి-హ‌ర‌నాథ్‌, సావిత్రి-జెమినీ గ‌ణేష‌న్‌.. వంటి వారు ఒక రికార్డు సృష్టించారు. అయితే.. అంజ‌లీ దేవి ఎక్కువ‌గా ప్రేమ చిత్రాల్లోఅక్కినేని స‌ర‌స‌నే న‌టించారు. అనేక సినిమాల్లో ఇద్ద‌రూ క‌లిసి ప్రేమికులుగా న‌టించారు. దీంతో, ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుందని.. ఇరువురూ పెళ్లి కూడా చేసుకుంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే. వాస్త‌వ జీవితంలో అలా జ‌ర‌గ‌లేదు.

కానీ, ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ అయితే చిగురించింద‌ని అంటారు. కానీ.. ఇది బ‌య‌ట‌కు రాలేదు. వారు చెప్పుకో లేదు. గ్యాసిప్స్ అయితే వ‌చ్చాయి. కానీ, అంజ‌లీదేవి అనూహ్యంగా సంగీత ద‌ర్శ‌కుడు ఆదినారాయ‌ణ రావును పెళ్లి చేసుకున్నారు. ఇది ఆమె ప్రేమ వివాహం అని ప్ర‌చారం చేసుకున్నారు. దీనికి కార‌ణం తెలియ‌దు కానీ.. ఒక సంద‌ర్భంగా ఆమె స్వ‌యంగా నారాయ‌ణ రావు గారు.. త‌ర‌చుగా మా ఇంటికి వ‌చ్చేవార‌ని చెప్పేవారు.

కానీ, వీరి వివాహంపై గుమ్మ‌డి మాత్రం వివ‌ర‌ణ రాశారు. ఆదినారాయ‌ణ‌రావు.. అంజ‌లి కుటుంబానికి దూరపు బంధువుల పిల్లాడు. అంజ‌లీదేవి యోగ‌క్షేమాల‌ను ఆయ‌న ద్వారానే అంజ‌లి త‌ల్లిదండ్రులు తెలుసు కునేవారు. ఈ ప‌రిణామ‌మే వారిని వివాహం దిశ‌గా అడుగులు వేయించేలా చేసింద‌న్నారు. కానీ, ఎక్క‌డా ఎవ‌రితోనూ ప్రేమ‌లో ప‌డిందా? లేదా? అనేది మాత్రంఎవ‌రూ చెప్ప‌లేదు. కానీ, గ్యాసిప్స్ మాత్రం వ‌చ్చేవి. ఇదీ.. సంగ‌తి!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news