ఓల్డ్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే.. వారి భర్తల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఎక్కడా కూడా.. వారి ప్రమేయం కూడా మనకు కనిపించదు. ఉదాహరణకు, జమున, శారద, వాణిశ్రీ, శ్రీలక్ష్మి, కృష్ణ కుమారి వంటి హీరోయిన్లు ఒక తరాన్ని కుదిపేశారు. అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాయించు కున్నారు. కానీ, వీరిలో అందరూ కూడా.. వివాహానికి ముందు.. తర్వాత.. కూడా రాణించారు.
అయితే.. సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్‌కు పెళ్లి అయితే.. ఇక, సినిమాలు మానుకునే పరిస్థితి ఉంది. కానీ, ఒకప్పుడు అలా లేదు. అంజలీదేవికి వివాహం అయిన తర్వాత..అనేక సినిమాలు హిట్ ఇచ్చాయి. పైగా ఆమె భర్త ఆదినారాయణ రావు ఆమెను దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేసేవారు. ఈ విషయాన్ని ఆమె కూడా ఎన్నోసార్లు గర్వంగా చెప్పుకున్నారు.
అదేవిధంగా శారద, వాణిశ్రీలు కూడా పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లులు అయిన తర్వాత.. కూడా మంచి సినిమాల్లో రాణించారు. చివరకు అత్త, అమ్మ పాత్రల్లో చాలా యేళ్ల పాటు వీరిద్దరు ఎప్పటకి గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. అయితే.. వీరు ఎంత ఎదిగినా.. వారి వెనుక భర్తలు ఉన్నా.. వారు ఎక్కడా జోక్యం చేసుకునేవారు కాదు. నిజానికి క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే.. సరే. కానీ, హీరోయిన్లుగా ఉన్న సమయంలోనూ వాణిశ్రీ భర్తకానీ, శారద భర్త కానీ, జమున భర్త కానీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు.
దీంతో వారి ఫ్యూచర్, కెరీర్ కానీ.. ఎక్కడా దెబ్బతిన లేదు. అంతేకాదు.. వివాహం జరగడానికి ముందు కంటే.. వివాహం జరిగిన తర్వాత.. మరింతగా రాణించడం గమనార్హం. ఆర్థికంగా పరిపుష్టించడంతోపాటు.. భర్తలను వెంటబెట్టుకుని… సినిమా షూటింగులకు వచ్చిన హీరోయిన్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇదీ.. భర్తల తాలూకు మంచి బుద్ధి.
ఇక శ్రీదేవి కూడా బోనికపూర్‌ను పెళ్లి చేసుకున్నాక హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించింది. అయితే పెళ్లి తర్వాత శ్రీదేవి విషయంలో బోనీ జోక్యం ఎక్కువుగా ఉండేదని అనేవారు. బోనీ ఎక్కువుగా కండీషన్లు, ఆంక్షలు పెట్టడంతో ఆమె తర్వాత కెరీర్ కంటిన్యూ చేయలేదు.