Moviesబన్నీ - మహేష్ మధ్య ఇంత గ్యాప్‌కు అదే కార‌ణ‌మా.... అంతలా...

బన్నీ – మహేష్ మధ్య ఇంత గ్యాప్‌కు అదే కార‌ణ‌మా…. అంతలా హర్ట్ అయ్యాడా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సన్నిహితంగా మెలుగుతారు. ఇతర హీరోల ఈవెంట్లకు సైతం మహేష్ హాజరై పాజిటివ్ గా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు తన నటనతో ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు. అయితే ఒక సందర్భంలో మహేష్ అల్లు అర్జున్ మధ్య గొడవకు ఒక సినిమా కారణమైంది.

2018 సంవత్సరంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు రెండు వారాల గ్యాప్ లో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే మొదట ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27వ తేదీన రిలీజ్ కావాలని ప్లాన్ చేసుకున్నాయి.

ఒకే రోజున ఇద్దరు హీరోల సినిమాలు విడుదలై ఉంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా భారీ స్థాయిలో నష్టపోయి ఉండేది. అల్లు అర్జున్ సినిమా నిర్మాతలు జోక్యం చేసుకుని రెండు సినిమాల రిలీజ్ డేట్లు మారేలా చేశారు. రిలీజ్ డేట్ మార్పు విషయంలో అప్పట్లో మహేష్ హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఏప్రిల్ 20వ తేదీన సినిమాను రిలీజ్ చేయడం కోసం మహేశ్ బాబు రేయింబవళ్లు కష్టపడ్డారు.

ఏప్రిల్ 20వ తేదీ మహేష్ తల్లి పుట్టినరోజు కావడం గమనార్హం. 2020 సంవత్సరం సంక్రాంతికి కూడా మహేష్, బన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాగా ఈ సినిమాలలో అల వైకుంఠపురములో సినిమా పైచేయి సాధించింది. బన్నీ, మహేష్ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా పోటీ పడుతున్నారు.ఇక అల‌, స‌రిలేరు సినిమాల టైంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు తీవ్రంగా పెరిగిపోయాయి. ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌లేదు. చివ‌ర‌కు దిల్ రాజు జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news