రాధిక గురించి తెలియని దక్షిణాది ప్రేక్షకులు లేరు. ఒకప్పుడు హీరోయిన్గా దుమ్మురేపిన ఈ బొద్దుగుమ్మ .. రాధ, జయప్రద, జయసుధ, శ్రీదేవిల సమకాలికురాలు. అయితే.. మిగిలినవారు.. ఫేడ్ అవుట్ అయినా.. రాధిక మాత్రం బుల్లితెరపై ఇప్పటికీ అగ్రనాయకురాలిగా రాణిస్తున్నారు. రాడాన్ టీవీ సంస్థను ఏర్పాటు చేసి వందల కొద్దీ సీరియళ్లను నిర్మిస్తూ.. దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాలను మించిన వ్యాపారం చేస్తున్నారు
అయితే.. రాధిక గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. ఆమె వివాహం గురించిన ఆసక్తికర సంగతులు వెలుగు చూస్తుంటాయి. ప్రస్తుతం ఆమె.. శరత్ కుమార్ దంపతులు. అయితే.. దీనికి ముందు రెండు వివాహాలు చేసుకున్న రాధిక ఓ బిడ్డకు తల్లి అయ్యారని.. అయితే.. అవి పొసగక పోవడంతో వాటిని వదిలించుకున్నారని అంటారు. వీరిలో ఒకరు కేరళకు చెందిన దర్శకుడు ప్రతాప్ పోతన్.
ప్రతాప్ పోతన్‌ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాధిక అతడు పెట్టే టార్చర్ భరించలేక యేడాదికే విడాకులు ఇచ్చేసింది. తర్వాత ఓ బ్రిటీషర్‌ను పెళ్లి చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యింది. రెండో భర్తతో ఓ పాపకు జన్మనిచ్చాక అతడి టార్చర్ తట్టుకోలేక విడాకులు ఇచ్చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత శరత్‌కుమార్‌తో పాత స్నేహం చిగురించి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది.
అప్పటికే శరత్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశారు.
రాధిక క్రిస్టియన్ మతస్తురాలు. కానీ, వివాహం చేసుకున్నవారంతా కూడా.. హిందూ సామాజిక వర్గం. ఇది.. ప్రధానంగా రాధిక వైవాహిక జీవితానికి అడ్డంకిగా మారిందనే చర్చ కొన్నాళ్లు సాగింది. అదే సమయంలో చిరంజీవితోనూ ప్రేమాయణం సాగించారని ఒక వినికిడి. దీనిపై అప్పట్లోనే పెద్ద వివాదాలు కూడా సాగాయి. అలానే రాధిక.. చంద్రమోహన్ వివాహం చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది,
కానీ, ఆమె ఆగిపోయారని కూడా తమిళనాట చర్చ ఉంది. అయితే.. ఇతమిత్థంగా ఆమె మాత్రం దీనిపై ఎక్కడా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ, గత పెళ్లిళ్లు
అనే మాట అంటారు. అయితే.. అవి ఎన్ని అనేవి మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉండిపోయాయి.