ప్రజెంట్ లిరిసిస్ట్ చంద్రబోస్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన లిరిక్స్ రాసిన ఆర్ ఆర్ ఆర్ లోని ఆయన లిరిక్స్ రాసిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోని ఇప్పటివరకు ఏ ఇండియన్ సాధించిన అరుదైన ఘనత దక్కించుకున్నాడు చంద్రబోస్ . ఫస్ట్ టైం ఓ ఇండియన్ గా ఆస్కార్ అవార్డు అందుకుని సంచలనం సృష్టించాడు.
ఇదే క్రమంలో చంద్రబోస్ ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డును కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆయనకు హెల్ప్ చేసిన పెద్ద వ్యక్తులకి ..ఆయనకు ఆఫర్స్ ఇచ్చిన పెద్ద మనుషులకి చూయిస్తూ .. వాళ్ల పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాడు . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు ఆస్కార్ అవార్డు చూపించి,, ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఎన్నో పాటలకి ఆయన లిరిక్స్ రాశారు . ఈ క్రమంలోని రాఘవేంద్రరావుకి సైతం ఆయన ఆస్కార్ అవార్డు చూపించి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు .కాగా ఇలాంటి క్రమంలోనే చంద్రబోస్ భార్య సుచిత్ర పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చంద్రబోస్ ఆస్కార్ లాంటి అవార్డు అందుకున్న చాలా సింప్లిసిటీగా ఉండడం అభిమానులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్న సరే ఆమె తన భర్త గురించి.. భర్తకు వచ్చిన ఆస్కార్ అవార్డు గురించి మాత్రమే మాట్లాడింది ..కానీ, హోస్ట్లు మిగతా వాళ్ళు ఎంత ఆమెను గుచ్చి గుచ్చి ఆస్కార్ అవార్డు రాకుండా చేసిన పెద్ద మనుషుల గురించి అడిగినా ఆమె ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు.
మరీ ముఖ్యంగా తమ్మారెడ్డి లాంటి వాళ్ళు ఆస్కార్ అవార్డు పై ఎలాంటి కామెంట్స్ చేశారో తెలిసిందే. ఆయన గురించి పలు ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎదురైనా సైలెంట్ గా స్కిప్ చేసింది తప్పిస్తే ..ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు . అందుకే ఈ జంట ఇంతటి క్రేజీ స్థానాన్ని అభిమానులో సంపాదించుకోవడానికి కారణం అంటూ జనాలు పొగిడేస్తున్నారు. ఇదే వాళ్ళ సింప్లిసిటీ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఇలాంటి అన్యోన్యమైన జంటను చూసి అందరూ నేర్చుకోవాలి అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు..!!