సినీ వినీలాకాశంలో హీరోయిన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న నటీమణుల్లో జమున ఒకరు. అయి తే.. ఆమె పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లలేదు. అప్పటికి ఉన్న భానుమతి, సావిత్రి, అంజలీదేవి, కన్నాంబ, కృష్ణకుమారి, షావుకారు జానకి.. వంటివారు ప్రయోగాలు చేశారు. కథా రచయిత్రులుగా, సినిమా నిర్మాతలుగా, దర్శకులుగా అనేక రూపాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.
మరి ఇలాంటి అవకాశాలు.. జమున కు రాలేదా ? అంటే..వచ్చాయి. ఆమెతో సినిమాలు తీసేందుకు.. దర్శక త్వం వహించాలని కూడా అనేక మంది ముందుకువచ్చారు. కానీ, ఆమె మాత్రం.. వీటిని తోసిపుచ్చారు. నాకెందుకు ఇవన్నీ.. ఏమో ఏం జరుగుతుందో
అని చెప్పి తప్పించుకునేవారు. అంతేకాదు.. నష్టం వస్తే.. ఎవరికి లాభం ? నాకు అంత సామర్థ్యం లేదు. ఉన్నప్పుడు నేనే పిలుస్తాను.. అని అనేవారు.
అయితే.. ఈ వ్యాఖ్యలను అప్పట్లో జమునతో చనువుగా ఉన్న హరినాథ్ వంటివారు. తోసిపుచ్చేవారు. జమునలో ఆ కెపాసిటీ ఉందని పరిచయం చేసిన నటుడు హరినాథే. ఆయనకు జమునకు ఉన్న అత్యంత సాన్నిహిత్యంతో ఆయన ఈ మాట అనేవారని ఇండస్ట్రీలో చెప్పుకొనేవారు. కానీ, జమున మాత్రం హరినాథ్ వ్యాఖ్యలను తోసిపుచ్చేవారు. అంతేకాదు.. ఆయనకు తనకు ఉన్న పరిచయం గురించి కూడా ఎక్కడా చెప్పేవారు.
దీంతో వీరి మధ్య ఉన్న పరిచయం గురించి అందరికీ తెలిసినా.. జమున నోటిదురుసు ముందు ఎవరూ మాట్లాడేవారు కాదు. తర్వాత.. హరినాథ్ తన భార్యతో విడాకులు తీసుకోవడం.. కూడా జమున గురించేనని పెద్దగా ప్రచారంలోకివచ్చింది.అయితే..దీనిని జమున ఖండించారు. ఆయన సంసారం ఆయనది.. నా సంసారం నాది.. దీనికి దానికి ముడిపెట్టి యాగీ చేయడం సరికాదు.. అని చెప్పేవారు. మరి ఏం జరిగిందో ఏమో.. ఇప్పటికీ ఇదో మిస్టరీ..!