ఇది నిజంగా నందమూరి అభిమానులకు ట్రిపుల్ ధమాకా అని చెప్పాలి. రీసెంట్ గానే నందమూరి బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ హిట్లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా మూడు రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది . ప్రజెంట్ నందమూరి బాలయ్య మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాకి కమిట్ అయి ఉన్నాడు.
ప్రెసెంట్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రన్ అవుతుంది . అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు జరిగితే మే ఆఖరికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . తర్వాత బాలయ్య ఏ డైరెక్టర్ తో నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ తన లక్కీ డైరెక్టర్ తో తన తర్వాత సినిమా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.
బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 కి ప్లాన్ చేయబోతున్నాడు బాలయ్య అంటూ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు అన్ని కుదిరితే జూన్ 10 ఆయన పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనం గా ప్రారంభించాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నారట . అంతేకాదు ఈ సినిమాలో ఏకంగా బాలయ్య ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్రజెంట్ బోయపాటి శ్రీను.. రామ్ పోతినేని తో కలిసి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా కూడా ఇంచుమించు మే ఎండింగ్ ..జూన్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్యాకప్ చెప్పేసి కొత్త ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఇద్దరు కాంబినేషన్ రిపీట్ అయిందంటే మాత్రం మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. చూద్దాం మరి బాలయ్య అఖండ 2 తో ఎలాంటి ఘన విజయాలను తన ఖాతాలో వేసుకోబోతున్నాడో..?