విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లో లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నారు. ప్రకాశం జిల్లా కారం చేడులో జన్మించిన వెంకటేష్ ను తెలుగు సినిమా అభిమానులు ముద్దుగా విక్టరీ వెంకటేష్, వెంకీ అని పిలుచుకుంటూ ఉంటారు. తన కెరీర్లో 71 పైగా సినిమాలలో నటించిన వెంకటేష్ ఏడు నంది అవార్డులు కూడా గెలుచుకున్నాడు. వెంకటేష్ ముఖ్యంగా హీరోయిన్ల హీరో. ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లను కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత సొంతం చేసుకున్నారు.
ఫరా, టబూ, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతిజింతా, కత్రినా కైఫ్, అంజుల ఝవేరి ఇలాంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్లను వెంకీ తెలుగు తెరకు పరిచయం చేసి… వారికి తెలుగులో మంచి లైఫ్ ఇచ్చాడు. వెంకటేష్ ఎంతమంది హీరోయిన్లతో నటించినా కొందరు హీరోయిన్లపై ఆయన ప్రత్యేకమైన ప్రేమను చూపించేవారు. అలాంటి వారిలో సౌందర్య, మీనాతో పాటు దివంగత వర్థమాన తార ఆర్తి అగర్వాల్ కూడా ఉన్నారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్లో ఏడు సినిమాలు వచ్చాయి.
మీనాతో నాలుగు సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్ అయ్యాయి. మీనా – వెంకటేష్ కాంబినేషన్లో చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, సూర్యవంశం లాంటి సూపర్ హిట్ లు వచ్చాయి. ఇక దివంగత అందాల తార ఆర్తి అగర్వాల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా వెంకటేష్. 2001 లో కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తి తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది. అక్కడ నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది.
ఆ తర్వాత ఆర్తితో వెంకీ వసంతం, సంక్రాంతి లాంటి సినిమాలు చేస్తే ఆ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. నువ్వు నాకు నచ్చావ్ సినిమా హిట్ అయ్యాక ఆ సినిమాలో వెంకీ – ఆర్తి కాంబినేషన్‌కు మంచి పేరు వచ్చింది. దీంతో వసంతం సినిమాలో హీరోయిన్గా వెంకీనే స్వయంగా ఆర్తిని రికమెండ్ చేశాడు. దీంతో వసంతం దర్శకుడు విక్రమ్ కూడా వెంకీకి ఓటు వేసి ఆ సినిమాలో ఆర్తిని హీరోయిన్గా తీసుకున్నాడు. ఇక సంక్రాంతి సినిమాలో వెంకీకి జోడిగా స్నేహ నటించింది. ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఒక స్పెషల్ రోల్ చేసింది.
ఈ పాత్ర కూడా వెంకటేష్ పట్టు పట్టడంతోనే ఆర్తి నటించింది. అయితే ఈ పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు. అయితే వెంకీ స్వయంగా అడగడంతో ఆర్తి కాదనకుండా ఆ రోల్ చేసింది. ఏదేమైనా వెంకీ – ఆర్తి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆర్తి ఫామ్ లో ఉండి ఉంటే వెంకీ మరో సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు.