Moviesఆ రోజుల్లోనే ఆ స్టార్ హీరోయిన్‌కు సొంత హెలీకాఫ్ట‌ర్‌… ల‌గ్జ‌రీ లైఫ్‌.....

ఆ రోజుల్లోనే ఆ స్టార్ హీరోయిన్‌కు సొంత హెలీకాఫ్ట‌ర్‌… ల‌గ్జ‌రీ లైఫ్‌.. కోట్ల ఆస్తులు… !

సాధారణంగా హీరోయిన్ల కంటే హీరోలు ఎక్కువ సంపాదిస్తారని.. హీరోలకు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయన్న నానుడి ఉంటుంది. ఇక పాత తరంలో తెలుగులో అయితే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ పొదుపుగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడా పెట్టారు. అసలు వీరిద్దరి దరిదాపుల్లోకి ఎవరు రాలేదు. ఆ తర్వాత కాలంలో శోభన్ బాబు, మురళీమోహన్ తాము సంపాదించిన సొమ్ము అంతా భూమి మీద పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్లో కోట్లకు పడగలెత్తారు. అయితే ఆ రోజుల్లోనే ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ ని మించిన కోటీశ్వరులు అయిన ఒక హీరోయిన్ ఉండేవారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు కేఆర్ విజయ.

ఆమె 1948లో కేరళలోని ట్రావెల్ కోర్‌లో జన్మించారు. తల్లి కళ్యాణి కేరళ రాష్ట్రానికి చెందినవారు కాగా.. తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన వ్యక్తి. కేఆర్ విజయ బాల్యం చాలావరకు తమిళనాడులోని పళ‌నిలో గడిచింది. కె ఆర్ విజయ చిన్నప్పటినుంచి టీవీ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఒకసారి జెమినీ గణేషన్ ఆమె నటన చూసి ముగ్ధుడు అయ్యి ఆమె హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రోత్సహించారు. అలా ఆమె తొలి సినిమా కర్పగం హీరో జెమినీ గణేషన్ అయ్యాడు.

అయితే ఒక ఫంక్షన్లో కె ఆర్ విజ‌య‌ను ఎన్టీ రామారావు సోదరుడు నందమూరి త్రివిక్రమరావు చూసి మెస్మరైజ్ అయిపోయారు. దీంతో తమ సొంత బ్యాన‌ర్ అయిన నేషనల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమె చారడేసి కళ్ళు.. చూడ చక్కని అందం.. అభినయం, అదిరిపోయే నాట్యం, ఇవన్నీ ఆమెను తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మార్చేశాయి. అప్పట్లో కేఆర్ విజయ అమ్మవారి పాత్రలకు పెట్టింది పేరు. ఆమె తొలిసారిగా మా ఇలవేల్పు సినిమాలో అమ్మవారి లా నటించారు. తమిళనాడులో అయితే ఆమెను చూస్తే చాలామంది పూనకాలతో ఊగిపోయేవారట.

అంటే కేఆర్ విజయ అమ్మవారి పాత్రలు అంతగా ప్రభావం చూపించాయి. ఆ తర్వాత బాలయ్య హీరోగా వచ్చిన భైరవద్వీపం సినిమాలో కురూపి పాత్రలో అలా ఒదిగిపోయారు. కె.ఆర్ విజయ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే కేరళ రాష్ట్రానికి చెందిన సుదర్శన్ చిట్‌ఫండ్స్ కంపెనీ అధినేత వేలాయుధన్ ఆమెను ప్రేమించారు.. పెళ్లి చేసుకుంటానని పెద్దలను ఒప్పించారు. ఆయనకు అప్పటికే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. అలా కేఆర్ విజయ వేలాయుధన్ భార్య అయ్యారు.

ఆ రోజుల్లోనే ఆమెకు నాలుగు వేల గజాలలో సర్వ సుందరంగా నిలయం ఉండేదట. ఆమె ఇంట్లో రెండు స్విమ్మింగ్ పూల్స్ తో పాటు కావలసినంత పార్కు ఉండేదట. ఆ రోజుల్లోనే కేఆర్.విజయ కుటుంబానికి సొంత హెలికాప్టర్ ఉండగా.. అది మేడ మీద ఆగే అంత పెద్ద భవనం ఉండేదట. కె.ఆర్ విజయ చాలా రాజభోగాలు అనుభవించారని.. అప్పట్లో స్టార్ హీరోయిన్లు కూడా ఆమె ఆస్తిపాస్తులు ముందు ఏ మాత్రం సరితూగే వారు కాదని అంటూ ఉంటారు.

ఇక మద్రాస్‌కు సమీపంలోనే కేఆర్ విజయ గార్డెన్స్ ఏకంగా 67 ఎకరాల పెద్ద తోటగా ఉండేదట. అక్కడ రకరకాల పళ్ళతో పాటు నాటు కోళ్లు కూడా పెంచేవారని.. అక్కడ షూటింగ్లో జరిగినప్పుడు విజ‌య‌ దర్శకులకు హీరోలకు నాటుకోడి పులుసు చేయించి మరీ పెట్టే వార‌ని.. అప్పటి సినీ జనాలు చెబుతూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news