Newsఆ ఒక్క పని చేస్తే కృతి శెట్టికి ఇంత తలనొప్పులు ఉండవుగా.....

ఆ ఒక్క పని చేస్తే కృతి శెట్టికి ఇంత తలనొప్పులు ఉండవుగా.. జర ఆలోచించు బేబమ్మ..?

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి టైం ప్రెసెంట్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. ఏది పట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో డిజాస్టర్ గా మారిపోతుంది . మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత ఎందుకు హిట్ కొట్టలేకపోతుందా..? అంటూ ఫ్యాన్స్ తెగ డీలా పడిపోతున్నారు. అయితే ఆ సినిమాలు కృతి శెట్టి అందం కారణంగా కాదు కంటెంట్ కారణంగా హిట్ అయ్యాయని ..ఆ తర్వాత సినిమాల్లో కంటెంట్ లేదని జనాలు చెప్పుకొస్తున్నారు .

ఏది ఏమైనప్పటికి ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడం కృతిశెట్టికి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే కృతిశెట్టికి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ లు ఎక్కువగా వస్తున్నాయట . అయినా కానీ కృతి ఫస్ట్ హీరోయిన్ గా నే చేయాలని అనుకుంటుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో కృతి తీసుకున్న నిర్ణయం పట్ల జనాలు ఫైర్ అవుతున్నారు.

అవకాశాలు రానప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ..ఇలాంటి అవకాశాలు రావాలని గిరిగీసిపెట్టుకుంటే కుదరదని ఫాన్స్ సజిస్ట్ చేస్తున్నారు . వచ్చిన అవకాశాలలో మంచివి ఒప్పుకొని హిట్ కొట్టి క్రేజ్ సంపాదించుకోవాలని ..అదే అసలైన హీరోయిన్ లక్షణం అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కృతి శెట్టి..దాదాపు నాలుగు సినిమాలకు పైగానే సెకండ్ హీరోయిన్ గా రిజెక్ట్ చేసిందట.

అంతే కాదు మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో కూడా శ్రీలీల ప్లేస్ లో మొదట అనుకునింది కృటి నే.. కానీ ఆమె సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ తో.. ఈ సినిమా నుంచి తప్పుకుందట . ఆ కారణంగానే ఈ సినిమా రిజెక్ట్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే కృతికి ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి బేబమ్మా..ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news