టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సూపర్ డూపర్ హిట్లతో కెరీర్ లో దూసుకుపోతున్నారు. టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ కు వరుస ఫ్లాపులతో కష్టాలు ఎదురయ్యాయి. కెరీర్ పరంగా బాగా డౌన్ అయిపోయాడు. అలాంటి టైంలో టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ కు చాలా సినిమాల తర్వాత తొలి హిట్ వచ్చింది. వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. ఇక కెరీర్ లో ఆరు వరుస హిట్లు కొట్టారు. ఈ తరం జనరేషన్ స్టార్ హీరోలలో ఎవరికి ఇలాంటి అరుదైన రికార్డు లేదు.
టెంపర్ సినిమాకు ముందు వరుసగా శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ఒక్క బాద్ షా సినిమా మాత్రమే కమర్షియల్ గా హిట్ అయింది. ఒకానొక దశలో ఎన్టీఆర్ సైతం ఎంత మంచిగా కష్టపడుతున్నా… ఈ పరాజయాలు ఏంటో తెలియక బాగా నిరుత్సాహానికి గురయ్యారు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ప్లాప్ సినిమాలకు కూడా లాభాలు వచ్చేవి. అప్పట్లో ఆ స్థాయిలో ఎన్టీఆర్కు క్రేజ్ ఉండేది.
దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామయ్య వస్తావయ్య సినిమా అంచనాలు అందుకోలేదు. ఎన్టీఆర్ కు జోడిగా శృతిహాసన్, సమంత హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించగా 2013లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటికే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి ఉండడంతో కచ్చితంగా రామయ్య వస్తావయ్య బ్లాక్బస్టర్ అవుతుందని భారీ అంచనాలు ఉన్నాయి.
పైగా దిల్ రాజు నిర్మాత. అంతకుముందే దిల్ రాజు – ఎన్టీఆర్ కాంబినేషన్లో బృందావనం లాంటి హిట్ సినిమా వచ్చింది. అయితే రామయ్యా వస్తావయ్య అంచనాలు అందుకోలేదు. అయితే సినిమాపై ఉన్న భారీ హైప్తో రు. 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ప్లాప్ అయినా కూడా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా తీసిన తనతో పాటు సినిమా కొన్న వారందరికీ మంచి లాభాలు వచ్చాయని సంతోషంగా చెప్పటం విశేషం.
దీనిని బట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్కు చిన్నవయసులోనే భయంకరమైన మాస్ హిట్లు రావడంతో… ఆ తర్వాత ఎంత మంచి సినిమాలు తీసినా… ఎన్ని క్లాస్ సినిమాలు చేసినా ప్రేక్షకులు అంతకుమించి కోరుకోవడంతో.. కొన్ని సినిమాలకు వసూళ్లు వచ్చిన ఫ్లాప్ సినిమాలుగా మిగిలి పోవాల్సి వచ్చింది.