జల్సా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ ఈ సినిమా కథను రెడీ చేసుకున్నప్పుడే ఈ సినిమాలో ఉన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే ఒక స్టార్ హీరో మాత్రమే కావాలని నిర్ణయించుకున్నాడు. త్రివిక్రమ్ అలా అనుకున్నప్పుడు ఆయన మదిలో మెదిలిన మొట్టమొదట హీరో పవన్ కళ్యాణ్. హీరోయిన్లుగా సమంతని, తమిళ నటి ప్రణీతను ఎంచుకున్నారు.
దర్శక నిర్మాతలు అలాగే కీలకపాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని తీసుకున్నారు. ఈ సినిమాలో సమంత తల్లిగా అలనాటి అందాల తార నదియా నటించారు. ఇక బ్రహ్మానందం కామెడీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. వేలకోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యాపారవేత్త తన మేనత్తను తన ఇంటికి తీసుకు వెళ్లేందుకు వెళ్లి… వాళ్ళ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసే పాత్రలో పవన్ నటన అదిరిపోయింది. నవంబర్ 2012లో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
2013 ఫిబ్రవరి 10 నుంచి కంటిన్యూగా షూటింగ్ జరిపి సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మొత్తం పైరసీ ద్వారా బయటికి వచ్చేసింది. ఇండస్ట్రీకే చెందిన కొంత మంది పెద్దలు కావాలని ఈ సినిమా రిలీజ్ కాకుండానే వీడియో మొత్తం బయటికి వచ్చేలా చేశారన్న చర్చలు జరిగాయి. ఇందులో ఓ అగ్ర నిర్మాత హస్తం కూడా ఉందని.. ఈ సినిమా నైజాం రైట్స్ తనకు ఇవ్వలేదని ఆయనే ఇదంతా చేయించాడు అన్న రూమర్లు కూడా బయటకు వచ్చాయి.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో నిర్మాత భోగవల్లి ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పవన్ సైతం ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐతే తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని వాపోయారు. విచిత్రం ఏంటంటే పైరసీ ద్వారా సినిమా బయటకు వచ్చినా కూడా సినిమా విడుదలయ్యాక థియేటర్లు నిండిపోయాయి. నెలరోజులపాటు టిక్కెట్లు దొరకలేదు. ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఫైనల్ గా అత్తారింటికి దారేది సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.
సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా నిర్మాతకు నష్టం వస్తే.. తాను ఫ్రీగా బాహుబలి ప్రసాద్ గారికి మరో సినిమా చేసి పెడతానని కూడా హామీ ఇచ్చారు. అయితే రిలీజ్ అయ్యాక భోగవల్లి ప్రసాద్‌కు కోట్ల రూపాయల కనక వర్షం కురిసింది. 170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న అత్తారింటికి దారేది 36 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. రిలీజ్ కి ముందే సినిమా మొత్తం పైరసీ ద్వారా బయటికి వచ్చేసి.. నెట్లో లేక్ అయినా కూడా రిలీజ్ అయ్యాక తిరుగులేని సంచలనం నమోదు చేసింది.
ఎన్నో రికార్డులతో పాటు… అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఏకైక సినిమాగా పవన్ అత్తారింటికి దారేది నిలిచిపోయింది. ఇలాంటి అరుదైన రికార్డు ఫ్యూచర్ లోను మరే హీరో బ్రేక్ చేయలేదంటే అతియోశక్తి కాదనే చెప్పాలి. అత్తారింటికి దారేది రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చూస్తుంటే కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.