ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో బాగా చర్చకు వస్తోంది. సమంత టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి పరిమితులు, కండీషన్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండగ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచనలు, అడుగులు మాత్రం కరెక్టుగా లేవనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సమంత క్రేజ్ ఇంకా ఇంకా పెరగాల్సింది పోయి తగ్గుతోంది. ఇందుకు ఆమె స్వయంకృతాపరాథమే.
ఆమె స్టార్ హీరోల సినిమాల్లో వాళ్లకు జోడీగా చేయడం మానేసి.. తానే లీడ్ రోల్ అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుపోతోంది. ఇది తప్పనే చాలా మంది చెపుతున్నారు. స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే వచ్చే క్రేజ్.. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు రావు. కమర్షియాలిటీ పరంగా కూడా ఈ సినిమాలకు ఆ స్థాయి క్రేజ్ ఉండదు. సమంత యశోద చేసింది.. ఏమైంది ఓకే అనిపించుకున్నా లాభాలు లేవు.
రేపు శాకుంతలం వస్తోంది. వాయిదాలు పడుతోన్న కొద్ది బజ్ తగ్గుతూ వస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఓటు అంటోన్న సమంత తన క్రేజ్, మార్కెట్ స్వయంగా తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో విజయశాంతి స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. అయితే ఆమె ఇటు స్టార్ హీరోలకు జోడీగా కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది.
విజయశాంతి ఒక్కసారిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు షిఫ్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు సమంత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే కాన్‌సంట్రేషన్ చేస్తున్నట్టుగా ఉంది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. ఎందుకో అనుకున్నంత బజ్ రావడం లేదు. సమంత కూడా ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వదులుకోవడం మంచిది కాదని.. ఇది ఆమె రాంగ్ ట్రాక్‌లోకి వెళుతున్నట్టే అంటున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు ముందుగా పూజాహెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె బిజీగా ఉండడంతో సమంతను అనుకున్నారు. కానీ సమంత ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకే ఓటు అనడంతో ఇప్పుడు శ్రీలీలను తీసుకున్నారు. కానీ నిజంగా సమంత పవన్ పక్కన చేసి ఉంటే ఆమె తారాస్థాయిలో ఉండేది. మరోసారి ఖచ్చితంగా అత్తారింటికి దారేది మ్యాజిక్ రిపీట్ అయ్యి ఉండేది. ఆమె కెరీర్ మరో రెండు మూడేళ్లు ఢోకా లేకుండా ఉండేది.
పవన్ సినిమా వదులుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తోంది. ఈ గ్యాప్‌ను అందిపుచ్చుకుని మంచి ఛాన్సులు తీసుకోకుండా.. వచ్చిన గోల్డెన్ ఛాన్సులే ఆమె వదిలేసుకుంటోంది. నిజంగా సమంత విడాకుల తర్వాత కూడా రంగస్థలం సినిమాలా కమర్షియల్ హీరోయిన్‌గా ఉండి ఉంటే మరోసారి మహేష్, పవన్, ఎన్టీఆర్‌తో చేసేసే ఉండేది. సమంత ఇప్పటకీ అయినా కమర్షియల్ హీరోయిన్‌గా కొనసాగితే ఆమెకు కొన్నాళ్ల పాటు తిరుగులేని భవిష్యత్తు ఉంటుంది.