Moviesఆ పాపమే సునీల్ పాలిట శాపంగా మారిందా..? తెలిసి తెలిసి అంత...

ఆ పాపమే సునీల్ పాలిట శాపంగా మారిందా..? తెలిసి తెలిసి అంత పెద్ద తప్పు చేసాడా..?

సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ .. కమెడియన్గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ..అటువైపుగా అడుగులు వేసి స్టార్ కమెడియన్గా పేరు సంపాదించుకున్నాడు . ఎంతలా అంటే అప్పట్లో సినిమాలో హీరోల కన్నా కమెడియన్ సునీల్ కే ఎక్కువగా డిమాండ్ ఉండేది . ఒకానొక టైం లో హీరోలకి సరి సమానంగా పారితోషకం అందుకుని.. స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చాడు సునీల్ . కాగా తర్వాత హీరో అవ్వాలని తన కలతో మరోసారి అటువైపుగా అడుగులు వేశాడు .

హీరోగా పలు సినిమాల్లో కూడా నటించాడు . అరాకొరా సినిమాలు తప్పిస్తే మిగతావన్ని ఫ్లాప్ అయ్యాయి. సునీల్ ఈ క్రమంలోనే మళ్లీ కమెడియన్ గా తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే గతంలో సునీల్ ఓ హీరోయిన్ ని ఏడిపించాడని .. ఆ పాపమే ఆయన పాలిట శాపంగా మారిందన్న వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యాయి. ఆర్తి అగర్వాల్ సునీల్ కి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో సునీల్ కమెడియన్ గా నటించాడు .

మరీ ముఖ్యంగా వీళ్లిద్దరు స్క్రీన్ టైమ్ కూడా బాగుంటుంది . అయితే అప్పట్లో తరుణ్ కి సునీల్.. ఆర్తి అగర్వాల్ – ఆర్తి అగర్వాల్ ను పెళ్లి చేసుకోవద్దని ..తరుణ్ కి వాళ్ళ అమ్మ గారితో పాటు సునీల్ కూడా చెప్పారని ..ఈ క్రమంలోనే తరుణ్ బ్రెయిన్ వాష్ చేశారని.. అప్పట్లో హాట్ టాపిక్ గా వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆ కారణంగానే ఆర్తి అగర్వాల్ తరుణ్ ని దూరం పెట్టాడు అంటూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో టాక్ వైరల్ అయింది .

తరుణ్ నుంచి ఆర్తి అగర్వాల్ దూరమై ఎంత క్షోభను అనుభవించిందో అందరికీ తెలిసిందే . సునీల్ చేసిన ఆ పాపమే ఇప్పుడు ఆయన పాట శాపంగా మారిందని ఇండస్ట్రీలో హీరోగా ఇటు కమెడియన్గా నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారని ..ఆయన హీరో అవ్వాలన్న ఆశ కూడా తుంచుకుపోయిందని.. ఇలా ఇండస్ట్రీ లో వచ్చిన సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనాలు కామెంట్ చేస్తున్నారు ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news