టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జున మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. గత ఐదారేళ్ళలో ఒక్క బంగార్రాజు సినిమా వదిలేస్తే నాగార్జున చేసిన అన్ని సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అవుతున్నాయి. చివరకు కాస్త మంచి టాక్ తెచ్చుకున్న ది ఘోస్ట్ లాంటి సినిమాలను కూడా ఎవరూ చూడటం లేదు. అసలు నాగార్జున సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్లకే రాని పరిస్థితి. ఎవరో ఎందుకు అక్కినేని అభిమానులు కూడా నాగార్జున సినిమాలను పట్టించుకోవడం లేదు.
బంగార్రాజు సినిమా విషయంలో నాగచైతన్య – కృతి శెట్టి లాంటి వాళ్ళు ఉండడంతో పాటు సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా రావడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. నాగార్జున కథల ఎంపికలో సీరియస్గా లేకపోవడం కూడా ఆయన ఎన్ని సినిమాలు చేసిన ప్లాప్ అవుతున్నాయని.. నాగార్జునకు వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ ఉందని అందుకే సినిమాలను ఆయన లైట్ తీసుకుంటున్నారని కూడా టాలీవుడ్ లో చర్చ ఉంది.
నాగార్జున పూర్తిగా వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో నాగార్జున వారసులకు కూడా సరైన హిట్ సినిమాలు రావడం లేదు. చైతు చేసిన చివరి రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఇటు అఖిల్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఏజెంట్ సినిమా ఎప్పుడు ? వస్తుందో తెలియట్లేదు. ఎప్పటికైనా బడ్జెట్ పరిధిలో దాటేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున వీరభద్రం చౌదరి డైరెక్షన్లో భాయ్ అనే డిజాస్టర్ సినిమాలో నటించారు.
ఈ సినిమా నాగార్జున అన్నపూర్ణ స్టూడియో మీద నిర్మించారు. సినిమా ఎంత ?డిజాస్టర్ అంటే పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కు తిరిగి రాలేదు. అంత ఘోరంగా తన్నేసింది. నాగార్జున చివరకు ఈ సినిమా డైరెక్టర్ వీరభద్రం చౌదిరిపై ఓపెన్ గానే విమర్శలు చేయటం అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే వీరభద్రం చౌదరి ఈ కథను ముందుగా మరో హీరో గోపీచంద్ కు చెప్పాడట. గోపీచంద్ రిజక్ట్ చేయడంతో.. ఈ కథ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కు బాగా సూట్ అవుతుందని నాగార్జునకు చెప్పగా.. నాగార్జున ఓకే చెప్పి సినిమా చేశాడు.
ట్ చేస్తే సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అలా గోపీచంద్ పెద్ద భయంకరమైన డిజాస్టర్ నుంచి బయటపడగా నాగార్జున బలైపోయాడు. అయితే ముందుగా తన అనుకున్న కథను కాకుండా.. ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు జరగడంతోనే ఈ సినిమా ప్లాప్ అయిందని వీరభద్రం చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.