మహానటి సావిత్రికి సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. ఆమె పేరు తెలియనివారు దక్షిణాది సినీ రంగంలోనే లేరు. ఇక, సావిత్రి.. ఆర్థికంగా పుంజుకున్న తర్వాత.. ఆమె దక్షిణాది నటీనటుల మధ్య ఐక్యత కోసం ప్రయత్నించారు. ఎందుకంటే.. అప్పట్లో ప్రాంతీయ భేదాలు ఎక్కువగా ఉండేవి. తెలుగు సినిమాను నేరుగా తమిళంలోను, కన్నడలోనూ డబ్ చేసే పరిస్థితి అక్కడలేదు. అందుకే నిర్మాతలు కథ కొని.. మళ్లీ తీసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోవడానికి అప్పట్లో సావిత్రి చేసిన పనులే కారణమని అంటారు.
ఈ క్రమంలో సావిత్రి సాయంత్రం 6 కాగానే.. భారీ ఎత్తున పార్టీలు ఇచ్చేవారు. అయితే.. పార్టీ అనగానే.. అందునా సావిత్రి ఇచ్చే పార్టీలు అంటే.. ఖచ్చితంగా గ్లాసుల గలగలలు ఉండేవి. దీంతో భానుమతి, అంజలీదేవి (నిర్మాతలు.. చిత్రనిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి) మాత్రం దూరంగా ఉండేవారు. దీంతో వీరిని పిలిచినా రారనే పేరు కూడా ఉండేది.
అయితే.. అప్పట్లో గీతాంజలి, కాంచన మాత్రం సావిత్రి ఇచ్చే విందులకు ఠంచనుగా హాజరయ్యేవారు.
విదేశీ మద్యాన్ని ప్రత్యేకంగా ఆఫర్ చేసేవారట సావిత్రి. కాంచన మాల పేకాట ప్రియురాలు. దీనికి మద్యం కూడా తోడు. ఇక గీతాంజలి.. తిండిపోతు అనే మాట ఉండేది. సావిత్రి ఎంతో ప్రేమతో.. చైనా.. జపాన్ డిసెష్‌ను చేయించి పెట్టడంతో రంగరావు.. నాగభూషణం, రాజబాబు(చిన్నవాడు) వంటివారు క్యూ కట్టేవారు.
మిగిలిన వారు మాత్రం దూరంగా ఉండేవారు. ఉదయం కాగానే.. ఏం జరిగింది? ఏం చర్చించారు? అని మాత్రం తెలుసుకునేవారు. కేవలం తిండి మాత్రమే కాకుండా.. సావిత్రి పార్టీల్లో కీలక మైన నిర్ణయాలు తీసుకునేవారు. వాటిని నేరుగా ప్రభుత్వాలకు కూడా పంపించి..అమలయ్యేలా సావిత్రి చర్యలు తీసుకోవడం విశేషం.