Moviesచిరంజీవికి తన కూతురు సుస్మిత అంటే అంత ఇష్టమా..? ఏం చేసాడో...

చిరంజీవికి తన కూతురు సుస్మిత అంటే అంత ఇష్టమా..? ఏం చేసాడో తెలిస్తే .. చేతులెత్తి దండం పెట్టేస్తారు..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే ..కాకుండా తన పేరు చెప్పుకొని నలుగురు పైకి ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారు . మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీను చిరంజీవి ఎలా తన భుజాలపై నడిపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సగానికి సగం మంది టాలీవుడ్ లో ఉండే హీరోలు మొత్తం మెహా హీరోలే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కాగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఉమెన్స్ డే సందర్భంగా తన పెద్ద కూతురు సుస్మితకు అదిరిపోయే బహుమతి ఇచ్చారు.

మహిళలను పోల్చే దుర్గామాత బొమ్మను ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన కూతురు సుస్మితకు విలువైన దుర్గామాత విగ్రహాన్ని బహుమతిగా అందించారు . ఈ క్రమంలోని సుస్మిత ఆ ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు నాన్నకు థాంక్స్ చెప్తూ ప్రత్యేక నోట్ ని ట్యాగ్ చేసింది .

“మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ..ఇలాంటి బహుమతి అందించినందుకు నాన్నకు చాలా చాలా థాంక్స్ ..స్త్రీలను శక్తివంతులుగా పోల్చే దుర్గ దేవి మాత కంటే ఇంకెలా వర్ణించగలం” అంటూ సింగిల్ నోట్ తో మెగా డాటర్ అందరు అటెన్షన్ గ్రాబ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి . దీంతో మెగాస్టార్ చేసిన పనికి మెగా ఫాన్స్ చేతులెత్తి దండం పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను ఇలా గౌరవిస్తే సమాజంలో ఎటువంటి చెడు ప్రభావాలు పడవు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news