కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా.. అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ఎట్టకేలకు మనకు దక్కింది . రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు ఆస్కార్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి తనదైన స్టైల్ లో ఆస్కార్ స్టేజిని షేక్ చేశారు .
పాట రూపంలోనే ఆయన తన స్పీచ్ ను కంటిన్యూ చేశాడు . అయితే అవార్డు అందుకున్న చంద్రబోస్ మాత్రం ఎక్కడా మాట్లాడలేదు . లాస్ట్ లో నమస్తే అంటూ చెప్పారే కానీ ఎక్కడ కూడా తన నోటికి పని చెప్పలేదు . ఈ క్రమంలోనే ఎందుకు ఆస్కార్ స్టేజిపై చంద్రబోస్ మాట్లాడలేదు అన్న న్యూస్ వైరల్ అయింది . మరి కొంతమంది ఆయనకు ఇంగ్లీష్ ఫ్యూయెంట్ గా రాదని అందుకే ఆయన మాట్లాడలేదంటూ అనుకున్నారు .
అయితే అదంతా తప్పు చంద్రబోస్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. అయితే ఆస్కార్ అకాడమీ రూల్ ప్రకారం అవార్డు అందుకున్న ఎవరైనా సరే 45 సెకండ్లకు మించి స్టేజిపై మాట్లాడకూడదు. అది వాళ్ళ నిబంధన ..అకాడమీ రూల్ ప్రకారమే ఆయన మాట్లాడలేదని తెలుస్తుంది. అందుకోసమే ఎం ఎం కీరవాణి స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడారని.. చివర్లో ఆయన నమస్తే అంటూ చెప్పకు వచ్చారని క్లారిటీ వచ్చింది. చంద్రబోస్ ఎందుకు స్టేజిపై మాట్లాడలేదు అన్న ప్రశ్నలకు ఆన్సర్ లభించింది..!!